తెలంగాణ మంత్రి మండలి సమావేశమై అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, మెట్రో విస్తరణతో పాటు అనాథ పిల్లల సంరక్షణ కోసం ఆర్ఫన్‌ పాలసీ తీసుకురావాలని నిర్ణయించింది. గవర్నర్‌ కోటాలో మండలికి అభ్యర్థులుగా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ లను నిర్ణయించింది. అలాగే మహబూబాబాద్‌లో ఉద్యాన కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో హైబ్రిడ్‌ విధానంలో 4 సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

నిమ్స్‌లో రూ.1800 కోట్లతో మరో 2 వేల పడకలు ఏర్పాటు ఏర్పాటుకు నిర్ణయించారు. బీడీ కార్మికులతో పాటు బీడీ టేకేదారులకు పింఛన్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. అలాగే మామునూరు విమానాశ్రయం కోసం 253 ఎకరాలు ఇవ్వడానికి ఆమోదం తెలిపార. గవర్నర్‌ వెనక్కి పంపిన 3 బిల్లులను మరోసారి అసెంబ్లీలో ఆమోదించాలని.. రెండోసారి ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ ఆమోదించక తప్పదని కేబినెట్ నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: