సీఎం రేవంత్ రెడ్డి తన కొత్త ఆఫీసు వేటలో పడ్డారు. అందులో భాగంగా హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సందర్శించారు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి అక్కడకు వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సోలార్ బ్యాటరీ వాహనంలో తిరిగి అన్ని బ్లాక్‌లను సీఎం రేవంత్‌ రెడ్డి పరిశీలించారు.


ఎంసీహెచ్‌ఆర్డీ ఫ్యాకల్టీ సభ్యులతో సమావేశమైన సీఎం రేవంత్‌ రెడ్డికి ఆ సంస్థ కార్యకలాపాలను ఆ సంస్థ డీజీ శశాంకగోయల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ గురించి సీఎం రేవంత్‌ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సంస్థలోని వివిధ బ్లాకులను సోలార్‌ పవర్‌ వాహనంలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్దేశించుకున్నలక్ష్యాలను సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: