జగన్‌ను అధ:పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్‌ కల్యాణే కాదు.. అంటూ పవన్‌ కళ్యాణ్‌ శపథం చేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో పవన్ కల్యాణ్ ఈ శపథం చేశారు. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్నానని.. తనను వైసీపీ నేతలు  
24 సీట్లేనా విమర్శించారని.. కానీ బలి చక్రవర్తి కూడా వామనున్ని చూసి ఇంతేనా అని అనుకున్నారని పురాణాలను గుర్తు చేశారు.

కానీ అదే వామనుడి బలి చక్రవర్తి నెత్తిన కాలుపెట్టి తొక్కితే గానీ వామనుడు ఎంతో అని తెలిసిందని పవన్‌ అన్నారు. సీఎం జగన్‌ను అధ:పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్‌ కల్యాణే కాదు అంటూ పవన్‌ భీషణ ప్రతిజ్ఞ చేశారు. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలేనని.. అందుకే అంకెలు లెక్కపెట్టవద్దని విపక్షాలకు చెప్పండని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కోట్లు సంపాదించే స్కిల్స్‌ ఉన్నా అన్నీ కాదనుకుని రాజకీయాల్లోకి వచ్చానని పవన్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: