అనంతరం ఆశా కిరణ్ మాట్లాడుతూ పాలకొల్లులో వనభోజనాలకు వెళ్తున్నామని ప్రస్తుతానికి రాజకీయ రంగ ప్రవేశం పైన ఎలాంటి ప్రకటన చేయదలుచుకోలేదని రాజకీయాలలోకి వచ్చే విషయం, ప్రకటనపై మరొకసారి మాట్లాడతానంటూ ఆశా కిరణ్ తెలియజేశారు. రాధా రంగా మిత్రమండలి ఆహ్వానం మేరకే తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని, రంగా ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారని తెలియజేసింది. కుటుంబ బాధ్యతలు ఇతర కారణాలవల్ల కొన్నేళ్లపాటు తాను ప్రజలకి దూరంగానే ఉన్నాను. కానీ ఇక మీదట పూర్తిగా నా ప్రయాణం ప్రజలతోనే ఉంటుందంటూ తెలియజేసింది.
ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా సరే తాను కూడా తన తండ్రిలాగే అండగా ఉంటానంటూ తెలియజేసింది ఆశాకిరణ్. రాధా రంగా మిత్రమండలిలో అందరిని ఒకే తాటికి తీసుకురావడం కోసమే తాను బయటికి వచ్చానని, ఇంకా తాను ఏ పార్టీలోకి వెళ్లాలనే విషయం పైన సరైన నిర్ణయం తీసుకోలేదని నిర్ణయం తీసుకున్న తర్వాత వెల్లడిస్తానని తెలిపింది. మా ఇద్దరి బాటలు వేరైనప్పటికీ ఆశయం మాత్రం ఒక్కటేనని .. ఇకమీదట రంగా అభిమానులతో కలుస్తూ ఉంటానని, రాధా రంగా మిత్రమండలిలో గ్యాప్ ఉన్నది ,ఆ గ్యాప్ లేకుండా కృషి చేస్తానంటూ తెలిపింది ఆశాకిరణ్. రంగా అంటే కాపు కులం మాత్రమే కాదు, అన్ని కులాల వారికి చెందినవారు .. నేను కూడా అంతేనంటూ తెలియజేసింది ఆశా కిరణ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి