రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ‘గ్లోబ్ ట్రాటర్’ గ్రాండ్ ఈవెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఈవెంట్‌కు సినీ ప్రముఖులు మాత్రమే కాదు, విదేశాల నుండి కూడా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చిన విషయం తెలిసిందే. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ సినిమా ‘వారణాసి’  నుండి ప్రత్యేక వీడియోను విడుదల చేయబోతున్నారని ముందే తెలియడంతో ఫ్యాన్స్‌లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ వీడియో దాదాపు మూడు నిమిషాల నిడివి కలిగి ఉంటుందని సమాచారం. అసలు షెడ్యూల్ ప్రకారం ఈ సమయానికి వీడియో విడుదల కావాల్సి ఉంది. కానీ, అనుకోని టెక్నికల్ ఇష్యూలు కారణంగా విడుదలలో ఆలస్యం జరిగింది. దీంతో వివిధ రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వ్యాపించాయి.


రాజమౌళి స్టేజ్‌పైకి వచ్చి నిజం చెప్పారు:

అనుకున్న సమయంలో వీడియో రిలీజ్ నిలిచిపోవడంతో, రాజమౌళి స్వయంగా స్టేజ్ మీదికి వచ్చి వివరాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే —“ఈ స్పెషల్ వీడియో ఒక్క క్షణం కూడా లీక్ కాకూడదని ఎంతో జాగ్రత్తపడ్డాం. అంత పెద్ద ళేడ్ స్క్రీన్‌పై టెస్ట్ చేయాల్సి రావడంతో రిస్క్ చాలా ఎక్కువ. బయట ఎవరికైనా ఆ క్షణం దొరికితే సోషల్ మీడియాలోకి వీడియో వెళ్లిపోయే అవకాశం ఉంది. అందుకే మేము భారీ క్రేన్లను ఉపయోగించి మొత్తం స్క్రీన్‌ని బ్లాక్ షీట్స్‌తో పూర్తిగా కవర్ చేశాము.” కానీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఒక తెలియని వ్యక్తి డ్రోన్ కెమెరాతో ఆ ప్రాంతం మీదుగా ఎగరేశాడట. దాంతో మొత్తం సీక్రసీ ప్లాన్ అడ్డం తిరిగిందని ఆయన తెలిపారు. “ఆ డ్రోన్ వీడియోని కాపీ చేయడానికి ప్రయత్నించినట్టు గుర్తించాం. వెంటనే టెస్టింగ్ ప్రక్రియను ఆపేయాల్సి వచ్చింది. అందుకే రిలీజ్ కొంచెం ఆలస్యమైంది. దయచేసి అభిమానులు సహకరించాలి” అని రాజమౌళి పేర్కొన్నారు.



ఈ ఒక్క మాటతోనే సోషల్ మీడియాలో భారీ హంగామా మొదలైంది.“ఎవరు ఆ డ్రోన్ పంపింది?”, “వారణాసి వీడియోని లీక్ చేయాలని ప్రయత్నించిన వ్యక్తి ఎవరు?”, “అంత భారీ సెక్యూరిటీ ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలో ఇలా ఎలా జరిగింది?” అని నెట్టింట్లో చర్చ మొదలైంది. మహేష్ – రాజమౌళి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ వార్త కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.వీడియో విడుదలలో ఆలస్యం జరిగినా, రాజమౌళి చెప్పిన వివరాలు చూసి ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగిపోయింది. “ఇంత జాగ్రత్తలు పడే వీడియో అంటే… ఇందులో ఏ స్థాయి విజువల్స్ ఉన్నాయో!” అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: