సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్సకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై అభిమానుల్లో ఏ స్థాయి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన "గ్లోబ్ ట్రాటర్" గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, మహేష్ బాబు ఫస్ట్ లుక్, అలాగే స్పెషల్ గ్లింప్స్ వీడియోను ఘనంగా రిలీజ్ చేశారు. అయితే ఈ భారీ ఈవెంట్‌లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ పెద్ద చర్చగా మారిపోయింది. రాజమౌళి ప్రత్యేకంగా సిద్ధం చేసిన గ్లింప్స్ వీడియోను ప్లే చేసే సమయంలో కొన్ని అనుకోని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. వీడియో మొదటిసారి సరిగా రన్ కాకపోవడంతో టీమ్ మళ్లీ ప్రయత్నించింది. అయితే రెండోసారి కూడా వీడియో పూర్తిగా ప్లే కాకపోవడంతో అక్కడే చిన్న గ్యాప్ ఏర్పడి, అభిమానుల్లో కన్‌ఫ్యూజన్ నెలకొంది.


ఇలాంటి చిన్న టెక్నికల్ బ్రేక్ రావడం వల్ల, ఈ ఘటన సోషల్ మీడియాలో  ట్రోలింగ్‌కు కారణమైంది. “రాజమౌళి లెవెల్ ఈవెంట్‌లో కూడా ఇలాంటి గ్లిచ్ ఎలా జరిగింది?” అంటూ నెటిజన్లు సరదాగా మీమ్స్ వదులుతున్నారు. కానీ ఈ వీడియో గ్లిచెస్ సినిమాపై ఉన్న క్రేజ్‌ను మాత్రం ఏ మాత్రం తగ్గించలేదు. ఇవన్నింటికంటే ఎక్కువ వైరల్ అవుతున్నది ఏమిటంటే—యాంకర్ సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన 'ఈవెంట్ ప్రిపరేషన్ వీడియో'! ఈ వీడియోలో రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, మరియు ఇతర ప్రముఖులు ఈవెంట్‌కు ఎలా రెడీ అవుతున్నారు, ఎలాంటి ప్రాక్టీస్ చేస్తున్నారు, బ్యాక్‌స్టేజ్‌లో ఎలా బిజీగా ఉంటున్నారు అన్న విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రేర్ మొమెంట్స్ కారణంగా ఆ వీడియో సోషల్ మీడియాలో ఊహించని రేంజ్‌లో వైరల్ అవుతోంది.



అసలు గ్లింప్స్ వీడియో కన్నా…అదే ప్రిపరేషన్ వీడియో జనాల్లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. అందులో కనిపిస్తున్న నేచురల్ మూమెంట్స్, టీమ్ ఎనర్జీ, స్టార్స్ మధ్యనున్న కెమిస్ట్రీ ఫ్యాన్స్‌కు బాగా నచ్చాయి. ముఖ్యంగా రాజమౌళి ప్రతి చిన్న డీటైల్‌ను పర్సనల్‌గా చెక్ చేస్తూ కనిపించడంతో, ఈ మూవీ స్కేల్‌పై ప్రజల్లో ఇంకా పెద్ద హైప్ పెరిగింది. ఇదే కారణంగా సోషల్ మీడియాలో ఇప్పుడు మొత్తం ఫోకస్ గ్లింప్స్ వీడియో నుంచి ఈ ప్రిపరేషన్ వీడియోపైకి మారిపోయింది. అన్నీ కలిపి చూస్తే— "వారణాసి గ్లింప్స్ కంటే పెద్ద హైలైట్ ఏదైనా ఉంది అంటే… అది సుమ షేర్ చేసిన ఆ వీడియోనే" అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: