రాజమౌళి–మహేష్ బాబు సినిమాకు సంబంధించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. టైటిల్‌, ఫస్ట్ లుక్‌, స్పెషల్ వీడియో రిలీజ్… అన్నీ అభిమానులు భారీ ఆశలతో ఎదురుచూసినవి. కానీ ఈవెంట్ జరిగిన తర్వాత మాత్రం ఆసక్తి కంటే ఎక్కువగా ట్రోలింగ్, మీమ్స్, నెగిటివ్ కౌంటర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈవెంట్ ప్లానింగ్‌పై, ముఖ్యంగా రాజమౌళి తీసుకున్న ఒక నిర్ణయం పై ఇండస్ట్రీలోని పలువురు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఈ నెగిటివ్ వేవ్‌కు ప్రధాన కారణంగా మూవీ గ్లింప్స్ వీడియో అని పేర్కొంటున్నారు. మొదట అనుకున్న టైమ్‌కి వీడియో రిలీజ్ చేయకపోవడం… తర్వాత రిలీజ్ చేశాక పెద్దగా ఆకట్టుకోకపోవడం… ఈ రెండు విషయాలు అభిమానుల్లో నిరాశ పెంచాయి. ఇదే సోషల్ మీడియా ట్రోలింగ్‌కు బలమైన కారణమైందనే అభిప్రాయం వినిపిస్తోంది.


అయితే అసలు హైలైట్‌గా మారిన విషయం 100 అడుగుల భారీ ఎల్ఈడి  స్క్రీన్ ఏర్పాటు. ఈవెంట్ కోసం ఇలా మహా పెద్ద స్క్రీన్ పెట్టే ఆలోచన రాజమౌళిదే అని ఇండస్ట్రీలో ప్రచారం. కానీ అంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్‌కు అవసరమైన పవర్ సప్లై ప్రాపర్‌గా పరిగణనలోకి తీసుకోకపోవడం పెద్ద తప్పిదంగా మారిందని సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. “అంత పెద్ద స్క్రీన్ ప్లాన్ చేస్తే ముందుగా పవర్ బ్యాకప్‌, సపోర్ట్‌, సేఫ్టీ—అన్ని క్లీయర్ గా ఉండాలి. ఈవెంట్ నాడు ప్రజలతో నిండిన హాల్‌లో టెస్ట్‌లు చేయడం ఎంతవరకు సరైన నిర్ణయం?” అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి అంటే ప్రతిదీ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ముందుకు తీసుకెళ్లే దర్శకుడు. అలాంటి ఆయన చిన్నపాటి సాంకేతిక అంశాన్ని ఎలా మిస్ అయ్యాడు? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.



ఇదే కారణంగా ఈవెంట్ సమయంలో టెక్నికల్ ఇష్యూలు రావడం, గ్లింప్స్ వీడియో డిలే అవ్వడం — రాజమౌళిపైనే తిరిగి నెగిటివిటీ పెరగడానికి కారణమైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా రాజమౌళి మీడియా పార్ట్నర్స్‌కు టైమ్‌కు ముందే కంటెంట్ పంపిస్తారు. అదే ఫాలో అయితే ఈ తలనొప్పి వచ్చేదే కాదు అని పలువురు కామెంట్ చేస్తున్నారు. “ఆ భారీ ఎల్ఈడి  స్క్రీన్ పెట్టిన అతి పనినే రాజమౌళికి నెగిటివ్‌గా మారింది” అని సోషల్ మీడియాలో, సినీ సర్కిల్స్‌లో కౌంటర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: