హత్యలు, అరాచకాలు చేయడానికా మీకు అధికారం ఇచ్చిందని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల నిలదీస్తున్నారు. హత్యాచారాలు చేయడానికా మీకు అధికారం ఇచ్చింది.. ఇందుకేనా ఈ వైసిపి నీ గెలిపించిందని నంద్యాల బహిరంగ సభలో నిలదీశారు. నంద్యాల ఎంఎల్ఏ ఇంట్లో అందరూ ఎంఎల్ఏ లు అంట కదా.. నియోజక వర్గంలో అన్నింట్లో దోపిడీలు అంట కదా.. అడ్డొచ్చే ఎవరినైనా చంపేస్తారట కదా.. కానిస్టేబుల్ సురేందర్ ను అనుచరులు హత్య ఎవరి పని.. ముస్లిం కుటుంభం మొత్తం ఆత్మహత్య అనుచరుల పనే కదా అని షర్మిల ప్రశ్నించారు.

అధికారంలో ఉన్నామని చంపుతారా.. కుందునది వరదలు వస్తే నంద్యాల మునుగుతుంది.. వరదలు రాకుండా కాలువ విస్తరిస్తా అన్నాడు.. ఆ హామీ మరిచాడు.. నంద్యాల చుట్టూ రింగ్ రోడ్ అన్నారు మరిచారు.. అధికారం ఇస్తే ఇన్నాళ్లూ గుడ్డి గుర్రాలకు పళ్ళు తొమారా.. ఎందుకు వీళ్లకు మళ్ళీ ఓటు వేయాలి.. మళ్ళీ దోచుకోవడానికి ఓటు వేయాలా అంటూ షర్మిల రెచ్చిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: