బంగారం ధరలు మరోసారి తగ్గాయి. ట్రంప్ విజయం తరువాత ఒక్కసారిగా పెరిగిన పసిడి ధర... ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలతో మళ్లీ పడిపోయింది. ప్రస్తుతం ఏకంగా 9 నెలల కనిష్టస్థాయికి తగ్గిపోయింది. పది రోజుల కిందట 32వేల రూపాయిలకు చేరిన టెన్ గ్రాం బిస్కెట్ గోల్డ్... ఇప్పుడు మరోసారి 30 వేల రూపాయిల స్థాయికి దిగివచ్చింది.