ఇటీవల  తెలుగు రాష్ట్రాలలో ఉల్లి కొరత బాగా ఉంది అనే సంగతి అందరికి తెలిసందే కదా. తెలుగు రాష్ట్రాలలో ఉల్లి కొరతను అధిగమించేందుకు రాష్ట్రానికి ఈజిప్టు ఉల్లిపాయలు దిగుమతి చేపట్టబోతుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, కేరళ, సిక్కిం రాష్ట్రాల్లో ఉల్లి కొరత చాల ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు దారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని  ఈ రాష్ట్రాలకు నాఫెడ్‌ (నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌) ద్వారా ఉల్లిని సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

 

Image result for onion

 

ఈ క్రమంలో.. ఈజిప్టు నుంచి 6,090 మెట్రిక్‌ టన్నుల ఉల్లి కొనుగోలుకు  కేంద్ర ప్రభుత్వం ఆర్డరు ఇవ్వడం జరిగింది.. దీనితో తొలిదశలో 2,265 మెట్రిక్‌ టన్నులను రాష్ట్రాలకు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది. కాగా, రాష్ట్రానికి 1000 మెట్రిక్‌ టన్నుల ఉల్లిని సరఫరా చేయాలని కోరుతూ రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ నాఫెడ్‌కు లేఖ రాయడం జరిగింది. 

 

Image result for onion

 

సముద్ర మార్గంలో ఈ ఉల్లిపాయలు దిగుమతి కానుండటంతో డిసెంబర్‌ 10 తర్వాత రాష్ట్ర కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా రైతుల నుంచి సర్కారు కిలో రూ.55 నుంచి రూ.60లకు కొనుగోలు చేసి  రైతుబజార్ల ద్వారా రాయితీపై కిలో రూ.25లకు విక్రయిస్తోంది. ఇలా రోజుకు 150 మెట్రిక్‌ టన్నుల ఉల్లిపాయలను మార్కెటింగ్‌ శాఖ కొనుగోలు చేయడం జరుగుతుంది అంటే నమ్మండి. దీనివల్ల ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం పడుతుంది అని అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఈ కొనుగోళ్లను ధరల స్థిరీకరణ నిధితో మార్కెటింగ్‌ శాఖ చేయిస్తుంది అని అధికారులు తెలియ చేస్తున్నారు.

 

Related image

 

ఇప్పటికైనా ఉల్లి కొరత తగ్గు ముఖం పడితే  ప్రజలకు కాస్త ఉపశమనం లభిస్తుంది. ఉల్లి కొరత తో ప్రజలు అందరిని కనీరు పెట్టిస్తుంది అని బాగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: