పిండి కొద్దీ రొట్టె అన్నట్టు.. మనం చేసే పనిని బట్టి లాభం చేకూరుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత శ్రమిస్తే, అంతే లాభం చేకూరుతుంది. ముఖ్యంగా వ్యాపారం లో ఎక్కువ లాభం  పొందాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు. అలాంటివారికి ఇటీవల ఒక సరికొత్త వ్యాపారం అందుబాటులోకి తీసుకు వచ్చాము. మీకు కొంత భూమి ఉందా..? ఇక పని చేసే సత్తా మీలో ఉన్నట్లయితే బంతిపూల వ్యాపారంతో ఏడాదికి రూ.లక్షల్లో లాభాలు పొందవచ్చు. అయితే వీటి సాగు గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..


ముఖ్యంగా ఈ బంతిపూలు సీజన్ తో  సంబంధం లేకుండా వస్తాయి . ఇక ఎప్పటికీ డిమాండ్ తగ్గని పూలు కాబట్టి  వీటికి మార్కెట్లో ధర కూడా బాగానే పలుకుతుంది. ఇకపోతే పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, పార్టీలకు, డెకరేటివ్ గా ఈ పూలను ఎక్కువగా వాడతారు. ఇది కేవలం ఆకర్షణ కు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా పనిచేస్తాయి. ఈ బంతి పూల లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని విటమిన్ సీ క్యాప్సిల్స్ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు అని సమాచారం. అంతేకాదు ఈ పూల నుంచి వచ్చే రసాన్ని గుండెపోటు అలాగే క్యాన్సర్లను నియంత్రించే మందుల లో ఉపయోగిస్తారు.

ఇందుకోసం మీ దగ్గర ఒక హెక్టారు పొలం ఉంటే చాలు. డిమాండ్ ఉన్న ప్రదేశాలలో వీటి ధర 60 నుంచి 70 రూపాయల వరకు కిలో పలుకుతోంది. ఒక ఎకరం పొలం లో వీటి సాగును ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఒకసారి పంట వేసినప్పుడు,  సుమారుగా రూ.70 నుంచి రూ.80 వేలు ఖర్చు అవుతుంది. ఇక ప్రతివారం 20 వేల రూపాయల లాభాన్ని పొందవచ్చు. దాదాపుగా ఈ పంటను సంవత్సరానికి మూడు సార్లు సాగు చేయడం వల్ల అత్యధిక లాభాలను వెనుక వేసుకోవచ్చు అంటున్నారు రైతులు. అంతేకాదు భూసారం బాగా ఉంది డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రదేశాలలో సంవత్సరానికి నాలుగు సార్లు కూడా సాగు చేయవచ్చు అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: