ఒకప్పుడు మనుషులు ఎంతో నిజాయితీగా ఉండే వారు. ఒకరిని మోసం చేస్తే మనకి పాపం చుట్టుకుంటుంది అనుకునేవారు. ఈ క్రమంలోనే సాటి మనుషులను మోసం చేయడానికి అసలు ఆలోచన చేసే వారు కాదు. కానీ ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా మనుషులు కుళ్లు కుతంత్రాలతోనే కనిపిస్తున్నారు. పైకి నవ్వుతూ కనిపిస్తున్న లోపల మాత్రం  ఏదో ఒక విధంగా తొక్కేయాలని ఆలోచనతోనే ఉన్నారు నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ. అంతేకాదండోయ్ ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ సభ్య సమాజంలో గౌరవంగా బతకడం కంటే అమాయకులను టార్గెట్గా చేసుకుని మోసాలకు పాల్పడి ఇక అందినకాడికి దోచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాను అని చెప్పాలి.


 దీంతో నేటి రోజుల్లో మోసాలకు సంబందించిన ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది ప్రతి ఒక్కరికి. కొన్నిసార్లు సొంత వాళ్లు సైతం మోసాలకు పాల్పడుతూ నేపథ్యంలో ప్రతి ఒక్కరిని  అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇక్కడ ఓ కేటుగాడు ఇలాంటి మోసానికి పాల్పడ్డాడు.  ఒక పెద్ద బిజినెస్ ఉంది అంటూ మాయ మాటలతో నమ్మించి చివరకి 20 కోట్ల రూపాయలతో టోకరా  వేశాడు. ఈ ఘటన కాస్తా ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.



 ఇప్పటికే రోజుకో రూపంలో ప్రజలకు టోకరా వేస్తున్న కేటుగాళ్లు   ఇక తాజాగా వత్తుల తయారీ పేరుతో మోసానికి పాల్పడ్డారు. హైదరాబాద్ బోడుప్పల్ కు చెందిన ఏబీసీ సంస్థ యజమాని బాల స్వామి గౌడ్ 20 కోట్ల మేర మోసం చేశాడు. దూది, వత్తుల తయారీ యంత్రం మేమే ఇస్తాం.. ఒత్తులు తయారు చేసి ఇస్తే చాలు 600 రూపాయలు ఇస్తాం అంటూ బాలస్వామిగౌడ్ ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోని 600 మంది నుంచి 1.70 లక్షల చొప్పున మొత్తంగా 20 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఆ తర్వాత బోర్డు తిప్పేసి టోకరా వేసాడు. దీంతో బాధితులు అందరూ పోలీసులను ఆశ్రయించగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: