
అందుకే తల్లి తండ్రి తర్వాత గురువే ప్రత్యక్ష దైవం అని చెబుతూ ఉంటారు కానీ ఇటీవల కాలంలో మాత్రం కొంత మంది టీచర్లు అటు విద్యార్థుల పాలిట యమకింకరులుగా మారిపోతున్నారు అని చెప్పాలి. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని ఇక ప్రయోజకులు అవుతారని స్కూలుకి పంపిస్తే స్కూల్లో టీచర్లు మాత్రం ఏకంగా విద్యార్థులపై ప్రతాపం చూపించి ఏకంగా ప్రాణాలు పోయే పరిస్థితిని తీసుకువస్తూ ఉన్న ఘటనలు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. టీచర్ దారుణంగా కొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం ఛిలాపూర్ లో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.
సాత్విక్ అనే బాలుడు కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. అయితే ఉపాధ్యాయుడు సాత్విక్ ను చితక బాధడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఇంటికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. అయితే సాత్విక్ చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కొడుకు ఉపాధ్యాయుడు కొట్టడంతోనే మృతి చెందాడు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు అయితే పాఠశాల యాజమాన్యం మాత్రం బెడ్ పైనుంచి కిందపడటంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారని అక్కడ మృతి చెందాడని కానీ ఇప్పుడు మాపై ఆరోపణలు చేస్తున్నారంటూ చెబుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి.