ఇటికల కాలం లో వీధి కుక్కలు ఎంతలా రెచ్చిపోతున్నాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దారిలో కుక్కలు కనిపించాయి అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా భయంతో ఊగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి. చిన్న  పిల్లల దగ్గర పెద్దవారి వరకు అందరికీ కూడా కుక్కలను చూస్తేనే వనికి పోయే పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. దీంతో ఇక కుక్కల బెడద నుంచి అటు జనాలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది అని చెప్పాలి.


 అయితే ఇటీవల కాలం లో ఇలా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ఎంతో మంది పై దాడి చేస్తున్న ఘటనలు కేవలం ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఏ రాష్ట్రంలో చూసిన ఇలాంటి ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఏకంగా కుక్కలు దాడి చేసి శరీరం మొత్తం గాయాలు చేయడం గురించి విన్నాం. కానీ ఇక్కడ ఒక కుక్క మాత్రం ఏకంగా ఒక వ్యక్తి ప్రైవేట్ పార్ట్ కొరికేసింది అని చెప్పాలి ఇందుకు సంబంధించిన వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. హర్యానాలోని కర్నల్ లో ఈ ఘటన జరిగింది అని చెప్పాలి.



 పిట్ బుల్ జాతికి చెందిన కుక్క 30 ఏళ్ల యువకుడి ప్రైవేట్ పార్ట్ కొరికేసింది. అయితే దాడి నుంచి తప్పించుకునేందుకు అతడు కుక్క నోట్లో క్లాత్ పెట్టాడు. అయినప్పటికీ ఆ కుక్క వదల్లేదు అని చెప్పాలి. చివరికి స్థానికులు వచ్చి కుక్కను కర్రలతో కొట్టి చంపేశారు. అయితే బాధిత యువకుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక చాలా దేశాల్లో పిట్ బుల్ జాతికి చెందిన కుక్కలను ఎంతో ప్రమాదకరమైన కుక్కలుగా పోలుస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: