
సాత్ నెంబర్ అనే గ్రామంలో ఇటీవల క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. గ్రామానికి చెందిన బిక్కు నాయక్ పంట పొలంలోని ఒక సమాధి వద్ద క్షుద్ర పూజల ఆనవాళ్లు ఉండడం స్థానికంగా అందరిని భయాందోళనకు గురిచేసింది. పసుపు కుంకుమ జీడిగింజలు ఎర్రటి వస్త్రాలు కర్ర బొమ్మ మంత్ర తంతాలతో చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఇక గ్రామస్తులు అందరూ ఒక్కసారిగా భయంతో వణికిపోయారు అని చెప్పాలి. అయితే అప్పటివరకు గ్రామం మొత్తం ప్రశాంతంగా ఉండేది. కానీ ఈ క్షుద్ర పూజలు ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత సాయంత్రం ఏడు గంటల తర్వాత బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు గ్రామస్తులు.
అయితే జరిగిన ఘటనపై ఇటీవల ఏకంగా గ్రామస్తులు అందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక క్షుద్ర పూజలు ఎవరు చేసి ఉంటారు అనే విషయంపై అక్కడ చర్చించారు. అయితే ఎవరైనా ఆకతాయిలు ఇదంతా చేసి ఉంటారని గ్రామస్తులు భావించారు. ఇక ఈ ఘటనపై అటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. అయితే ఇలా పోలీసులకు ఫిర్యాదు చేసిన కూడా గ్రామస్తుల్లో క్షుద్ర పూజలపై ఉన్న భయం మాత్రం పోలేదు. దీంతో భయంతో బయటికి వెళ్లలేని పరిస్థితిలో మునిగిపోయారు.