క్యారెట్ కేక్ తయారుచేసే విధానం... ఒక గిన్నెలో గుడ్లను పగుల గొట్టి బాగా గిలక్కొట్టాలి. అందులో మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు, పంచదార పొడి, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి వేసి బాగా గిలక్కొట్టాలి. జీడిపప్పును చిన్నగా తురుముకుని వాటిని కూడా వేయాలి. చివర్లో క్యారెట్ తురుము కూడా వేసి బాగా గిలక్కొట్టాలి. ఇప్పుడు ఓవెన్ 180 డిగ్రీలకు ప్రీ హీట్ చేసి పెట్టాలి. కేక్ ట్రే అడుగుభాగాన కాస్త వెన్న రాసి మైదా చల్లాలి. అందులో క్యారెట్ తరుము మిశ్రమాన్ని వేయాలి. ఆ ట్రేను ఓవెన్ అరగంట పాటూ ఉంచాలి. అనంతరం బయటకు తీసి చల్లారేవరకు వదిలేయాలి. చల్లారాక ఆ క్యారెట్ కేకును ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి.