ఇంటికి వచ్చిన అతిథులు లేదా సాయంత్రం టీతో ఏదైనా ప్రత్యేకంగా తయారు చేయాలి అనుకుంటున్నారా ? అయితే ఈసారీ ఏం చేయాలో తెలియక అక్కడే ఆగిపోయేవారి కోసం ఈ మసాలా చీజ్ టోస్ట్ రెసిపీ. ఇది చేయడానికి ఎక్కువ శ్రమ తీసుకోదు, పైగా సమయం కూడా పెద్దగా పట్టదు. వెంటనే సిద్ధం చేసేయొచ్చు. పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రాలు ఏం చేయాలో తెలియని తికమక పరిస్థితిలో మసాలా చీజ్ టోస్ట్ ఒక గొప్ప వంటకం. ఎందుకంటే చాలా మంది పిల్లలు చీజ్ తినడానికి ఇష్టపడతారు. అయితే చీజ్ కు ఇలా కొత్త ట్విస్ట్ ఇవ్వడం ద్వారా మరింత రుచికరంగా చేయవచ్చు. మరి ఈ స్పెషల్ స్నాక్ రిసిపి ఎలా చేయాలో తెలుసుకుందాం.

మసాలా చీజ్ టోస్ట్ పేరు వినగానే రిచ్ గా, ఇది రుచిలో చాలా ఘాటుగా, కారంగా ఉంటుందని అన్పిస్తుంది. ఇందులో విషయం ఏంటంటే ట్విస్ట్ జోడించడమే. దీన్ని తయారు చేయడానికి మీకు సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్ కూడా అవసరం. అర టీస్పూన్ ఎర్ర కారంతో పాటు, ధనియాల పొడి, రుచికి తగిన ఉప్పు, రెండు బ్రెడ్లు, చీజ్ సరిపోతాయి అంతే !

మసాలా చీజ్ టోస్ట్ చేయడానికి ముందుగా ఉల్లిపాయ, క్యాప్సికమ్ మరియు క్యారెట్‌లను సన్నగా కోయాలి. ఇప్పుడు ఈ వాటిపై రుచి ప్రకారం ఎర్ర మిరప పొడి, ఎండుమిర్చి, ధనియాల పొడి మరియు ఉప్పు వేయండి. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ పాన్‌లో మెత్తబడే వరకు ఉడికించాలి. ఇప్పుడు బ్రెడ్ తీసుకుని దానికి ఒకవైపు కూరగాయలు వేయాలి. దాని పైన సిద్ధం చేసుకున్న మసాలా వేయాలి. పెనం మీద బాగా కాల్చుకోవాలి. దీనిని చేయడానికి బట్టర్ వాడొచ్చు. పైన తురిమిన చీజ్ చల్లి, గ్రీన్ లేదా టమాటో సాస్ తో సర్వ్ చేయండి. అంతే మీ మసాలా చీజ్ టోస్ట్ సిద్ధం అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: