ఏపీలో మరో దళిత యువకుడికి శిరోముండనం : నిర్మాత నూతన్ నాయుడు ఇంట్లో కర్రి శ్రీకాంత్ అనే వ్యక్తి 4 నెలలుగా పనిచేస్తూ ఇటీవల పని మానేశాడు. అయితే నూతన్ ఇంటి భద్రతా సిబ్బంది శ్రీకాంత్‌ను పని ఎందుకు మానేశావని ప్రశ్నించారు. ఆ తరువాత ఇంటికి వచ్చిన బ్యూటీషియన్ సెల్‌ఫోన్ హ్యాక్ చేసి అసభ్యంగా ప్రవర్తించావంటూ దుర్భాషలాడుతూ, క్షురకుడిని పిలిపించి శిరోముండనం చేయించారు.