ఈ కాలం స్మార్ట్ ఫోన్ కాలం.. ఇంట్లో పది మంది ఉంటే పది స్విచ్ బోర్డులతో పది స్మార్ట్ ఫోన్లు ఉండాలి. లేదు అంటే గొడవలు జరిగిపోతాయి. అలా ఉంది కాలం. అవసరానికి మాత్రమే ఉపయోగించాల్సిన స్మార్ట్ ఫోన్ ని మన అవసరాలను పక్కన పెట్టి మరి స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న వారి సంఖ్య పెద్దదే. ఇంకా స్మార్ట్ ఫోన్ వినియోగం అనేది చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగానే ఉంది. స్మార్ట్ ఫోన్ కోసం గొడవ పడటం, కొట్టుకోవడం, తిట్టుకోవడం కామన్ అయిపోయింది. 

 

అందుకే ఇప్పుడు తాజాగా చంపడం లేదా ఆత్మహత్య చేసుకొని చావడం నేర్చుకుంటున్నారు ఈ కాలం ఆణిముత్యాలు. అదే రేపటి పౌరులు. ఇంకా అలానే స్మార్ట్ ఫోన్ కోసం అక్కతో గొడవపడి బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా చిత్తూరులో జిల్లాలో చోటు చేసుకుంది. చంద్రగిరి మండలం దోర్ణకంబాలకు చెందిన రాజు, సుమతి దంపతులకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు కూతురు ముని విద్య, రెండో సంతానం కొడుకు ముని తేజ ఉన్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న అక్క తమ్ముళ్లు స్మార్ట్ ఫోన్ కోసం గొడవపడ్డారు. 

 

ఇంకా ఇద్దరి అల్లరి మితిమీరడంతో తండ్రి రాజు తీవ్రంగా మందలించాడు. దీంతో మనస్థాపంకు గురైన బాలుడు మునితేజ గదిలోకి వెళ్లి తలపులు వేసుకుని గడియ పెట్టుకున్నాడు. అయితే కొద్ది సేపటికి అనుమానం వచ్చి తలుపులు కొట్టిన తియ్యకపోవడంతో బలవంతంగా తలపులు తెరిచి చూశారు.. అయితే ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. అయితే తండ్రి తిట్టడం కారణంగానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

 

కాగా కోన ప్రాణంతో ఉన్న బాలుడిని 108 వాహనం తిరుపతి రుయాకు తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకు మృతుదేహాన్ని చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. క్షణాకావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కుటుంబమే చెల్లాచెదురైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: