విషయానికొస్తే.. ప్రియుడి ఆచూకీ తెలపాలంటూ ఓ ప్రియురాలు వాటర్‌ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండల పరిధిలోని మల్లాపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా వేంసూర్ మండలానికి చెందిన ఓ యువతి కొన్నేళ్లుగా హైదరాబాద్ లో నివసిస్తుంది. స్నేహితులు ద్వారా మల్లాపూర్ గ్రామానికి చెందిన రాఘవేందర్‌రెడ్డి తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. శారీరకగా దోచుకొని ఇప్పుడు పెళ్లి పేరు వినగానే పారిపోయాడని వాపోయింది.
యువతి కొన్ని నెలల కిందట హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రాఘవేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బెయిల్ పై ఇటీవల బయటకు వచ్చాడు. అప్పటి నుంచి ఆమె ప్రియుడిని కలిసేందుకు యత్నించగా ఆచూకీ లభించలేదు. ఇటీవల ఆమె ప్రియుడి సొంతూరు మల్లా పూర్‌కు వెళ్లి ఆరా తీసింది. అక్కడా లేకపోవడం తో నిరాశకు గురైంది. అతని సొంత ఊరికి వచ్చింది. అక్కడ వాటర్ ట్యాంక్ పైకి. ఎక్కి నాకు ప్రియుడి ఆచూకీ తెలపాలని డిమాండ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు న్యాయం చేస్తామనడంతో యువతి ట్యాంక్ దిగింది. ఆమెను పోలీసులు కొత్తూరు పీఎస్‌కు బదిలీ చేశారు. యువతి వివరాల ప్రకారం కేసును నమోదు చేశారు.. అతని ఆచూకీ త్వరలోనే కనిపెడతామని హామీ ఇచ్చారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి