కొన్ని రోజులుగా నువ్వు అందంగా లేవు లావుగా ఉన్నావంటూ.. ఆమె భర్త రోజు వేధించేవాడు. అక్కడితో ఆగకుండా... వేరే మహిళను పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి ఆమెను బాధలకు గురి చేసేవాడు. దీంతో సదరు వివాహిత... తీవ్రంగా కుంగిపోయేది. మరో విషయేంటంటే... ఆ వివాహిత... అత్తమామలు కూడా... తమ కొడుకుకు వేరే పెళ్లి చేసేందుకు మద్దతు పలికారు. హైదరాబాద్ లోని ఎస్సార్‌నగర్ పోలీసులు వెల్లడించిన వివరాలు.... సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన హలీమాబేగం (25) అనే మహిళకు.... బోరబండ స్వరాజ్‌నగర్‌కు చెందిన అబ్దుల్ హాసిఫ్ (32) అనే వ్యక్తితో 2018 జూన్‌లో పెళ్లైంది. వీరికి ప్రస్తుతం రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లై మూడు సంవత్సరాలు గడిచిన తర్వత.. ఓ కొడుకు కూడా పుట్టినాక... హాసిఫ్ కు తన భార్య అందంగా లేదని వేరే వారిని పెళ్లి చేసుకోవాలనే పాడు బుద్ది పుట్టింది. దీంతో తరచూ భార్యను నీవు అందంగా లేవంటూ... వేధించడం మొదలు పెట్టాడు.
సూటి పోటి మాటలతో ఆ వివాహిత అత్తమామలు కూడా ఆమె పట్ల కర్కశంగా వ్యవహరించేవారు. ఇలా చేస్తున్నారని హలీమా పుట్టింటి వారికి చెప్పింది. దీంతో హాలీమా అత్తమామలతో పుట్టింటి వారు మాట్లాడినా కూడా ఫలితం లేకుండా పోయింది. విడాకులు ఇవ్వమని పోరు పెడుతున్నారని... తనను ఇంటికి తీసుకెళ్లమని... గురువారం పొద్దున హలీమా తన తల్లికి ఫోన్ చేసి బాధపడింది. కానీ తర్వాత ఏం జరిగిందో హాలీమా... చున్నితో ఉరేసుకొని తనువు చాలించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి