ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఓ చోట ఆడపిల్లలపై అత్యాచారం జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఆడపిల్లలపై అత్యాచారం చేస్తే శిక్షించడానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకువచ్చాయ్. కానీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. ఒక కోర్టులో ఉరి శిక్ష పడితే ఇంకో కోర్టుకి ఆ కోర్టులో శిక్ష పడితే పై కోర్టుకి వెళ్లి శిక్ష నుంచి తప్పించుకుని కాలయాపన చేస్తూ దర్జాగా జనాల్లో తిరగొచ్చు అని అందరిలో ధీమా అందరిలో వచ్చింది. దీంతో ఎక్కడ వెనకడుగు వేయకుండా ఆడపిల్ల పై అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు.
ఇలా ఆడపిల్లలు కామపు కోరల్లో చిక్కుకొని బలి అవుతూనే ఉన్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని బాలికపై సామూహిక అత్యాచారం జరగడం సంచలనంగా మారిపోయింది. ఉత్తరప్రదేశ్లోని భూపాల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జామపండు ఇస్తాము అంటూ ఆశ చూపి బాలికను తోట లోకి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి