భార్య భర్తల బంధం అన్నది అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఎప్పుడూ ఒకరి పై ఒకరు అమితమైన ప్రేమను చూపించుకుంటూ ఉండాలి ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకోవడం ఒకరి అభిప్రాయాలను పరస్పరం పంచుకుంటూ ఉండాలి అలా అయితేనే భార్య భర్తల బంధం అన్యోన్యంగా ఉంటుంది. అయితే అన్యోన్యత కేరాఫ్ అడ్రస్ అయిన భార్య భర్తల బంధం లో అనుమానం అనే పెనుభూతం దూరితే ఇక అది ఎంత దారుణానికి దారితీస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది. ఒకసారి అనుమానం వచ్చింది అంటే చాలు ఎన్నో దారుణ ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి


 ముఖ్యంగా అనుమానంతో ఏకంగా కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చిన ఘటన లు కూడా వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది కట్టుకున్నవాడే కాలయముడు గా మారిపోయాడు  అనుమానంతో భార్యను దారుణంగా ఉరివేసి ప్రాణాలు తీస్తాడు  ఇక అనంతరం భార్య ఆత్మహత్య చేసుకుంది అని చిత్రీకరించేందుకు నాటకాలు మొదలుపెట్టాడు. కాని చివరికి పోలీసులకు చిట్టి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పరిధిలోని మాణిక్యమ్మ గూడ లో వెలుగులోకి వచ్చింది. నరసింహుల కు లక్ష్మమ్మ కు 2005లో వివాహం జరిగింది


 పెళ్ళయిన కొన్ని రోజులకే నరసింహ అత్తారింటికి మకాం మార్చాడు దంపతులు ఇద్దరు కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఐదు రోజుల క్రితం భార్య మొబైల్ కి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ రావడాన్ని గమనించిన నరసింహ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఎవరు ఫోన్ చేస్తున్నారు అంటూ సూటిపోటి మాటలతో నిత్యం వేధించే వాడు. ఇటీవల ఇదే విషయంపై భార్యతో గొడవ పడ్డాడు. తెల్లవారుజామున నిద్రలేచి మరోసారి గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే మాటా మాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన నరసింహ ఏకంగా విద్యుత్ వైరు తో భార్య మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. ఫ్యాన్ కి ఉరేసుకుంది అన్నట్లుగా నాటకం ఆడాడు. కానీ మృతురాలి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇక భర్తను విచారించగా అసలు విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: