సిని ప్ర‌ముఖుల‌ను మోసం చేసిన శిల్ప చౌద‌రి కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వ‌స్తోంది. కీల‌క మ‌లుపులు తిరుగుతూ కి`లేడీ` బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 200 కోట్ల వ‌ర‌కు డ‌బ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో పోలీసులు శిల్ప చౌద‌రిని విచారిస్తున్న విష‌యం తెలిసిందే. రెండు రోజుల పాటు శిల్ప చౌద‌రిని విచారించిన పోలీసులు.. ఈ రోజు రాధికారెడ్డిని విచారించ‌నున్నారు. అలాగే మ‌రోసారి శిల్ప‌ను క‌స్ట‌డీలోకి తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు పోలీసులు. ఈరోజు ఉప్ప‌ర్‌ప‌ల్లి క‌స్ట‌డీ పిటీష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు.


ఈ క్ర‌మంలో శిల్పాచౌద‌రి వ‌ర్సెస్ రాధికారెడ్డిగా ఈ కేసు మ‌లుపు తిరిగింది. రాధికారెడ్డికి కోట్ల రూపాయ‌లు ఇచ్చాన‌ని శిల్పా చౌద‌రి.. లేదు శిల్ప‌నే త‌న‌ను మోసం చేసింద‌ని రాధికారెడ్డి చెబుతూ వ‌స్తున్నారు. రాధికారెడ్డి మాత్రం త‌న ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయ‌ని శిల్ప చేసిన మోసాల‌కు సంబంధించిన ఆధారాల‌ను పోలీసుల ముందు ఉంచుతానంటోంది రాధికారెడ్డి. ఈ క్ర‌మంలో పోలీసులు అస‌లు సంగ‌తి ఏంటి అంటూ.. శిల్పా చౌద‌రి నిర్వ‌హించిన కిట్టీ పార్టీల‌పై విచారిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ పేరుతో దందా స్టార్ట్‌ చేసిన శిల్పా చౌదరి.. చాలా మందిని మోసం చేసింది.


సినిమా ఇండస్ట్రీ ప్ర‌ముఖుల‌తో పాటు ప‌లువురు రాజ‌కీయ నేత‌లు కూడా శిల్పాచౌద‌రి బాధితుల జాబితాలో ఉన్నారు. దీన్ని బ‌ట్టి శిల్పా చౌద‌రి మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతోంది. దివ్యారెడ్డి పోలీసుల‌కు కంప్లైంట్ ఇవ్వ‌డంతో బాధితులు ఒక్కొక్క‌రుగా ముందుకు వ‌స్తున్నారు. శిల్ప వ్యాపారాల‌పై ఫిర్యాదులు వెల్లువెత్త‌డంతో రంగంలో దిగిన పోలిసులు విచార‌ణ మొద‌లు పెట్టారు. అధిక వ‌డ్డీ ఆశ‌చూపి బిగ్ షాట్స్ నుంచి కోట్ల డ‌బ్బులు వ‌సూలు చేసింది. శిల్ప రిచ్ లైఫ్ చూసి న‌మ్మిన కొంద‌రు ఆమెకు అధిక వ‌డ్డికి కోట్లాది రూపాయ‌లు అప్ప‌జెప్పారు. తీరా చూస్తే వ‌డ్డీ కాదు క‌దా అస‌లుకే ఎస‌రు పెట్ట‌డంతో క‌ళ్లు తెరుచుకున్న వాళ్లు పోలిస్ ల‌కు ఫిర్యాదు చేయడం మొద‌లు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: