సాధారణంగా సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికుల పై ఇక సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎంతో గౌరవం చూపిస్తూ ఉంటారు. దేశానికి కోసం ప్రాణాలర్పించేందుకు సైతం సిద్ధంగా ఉండే సైనికుల పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా గ్రామస్తులు సైనికులపై దాడి చేసి కత్తులతో దారుణంగా విచక్షణ రహితంగా నరకడం సంచలనంగా మారిపోయింది. ఏకంగా సైనికులకు ప్రజలకు మధ్య జరిగిన గొడవ  అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది.


 ఇటీవలే నాగాలాండ్ లో వెలుగులోకి వచ్చిన కాల్పుల ఘటన దేశ వ్యాప్తంగా ఎంత చర్చనీయాంశంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. బయటికి వస్తున్న  నిజాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి. నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో ఇటీవలే కాల్పులు సంచలనం సృష్టించాయి. తిరు - ఓటింగ్ గ్రామాల మధ్య  రోడ్డుపై వెళ్తున్న వాహనంలో ఒక పరికరాన్ని గమనించారు సైనికులు.


 ఇక ఈ పరికరాన్ని చూసి సైనికులు పొర పాటు పడటమే దారుణం ఘటనకు దారి తీసింది. వాహనంలో ఉన్న పరికరం వేటకు ఉపయోగించే రైఫిల్ గా సైనికులు భావించారు. ఈ క్రమంలోనే ఇక వాహనంలో రైఫిల్  ఉన్నట్లు సైనికులు భావించగానే కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే తుపాకీ శబ్దం విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. సైనికుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో అక్కడి ప్రజలందరూ ఇక సైనికులపై   కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏకంగా ఒక సైనికుడి గొంతు కోసి చంపారు అన్న విషయాన్ని ఇటీవలే ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. 13 మంది సైనికులకు కత్తి గాయాలయ్యాయని వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: