ఇల్లు కి పునాది ఎంత అవసరమో అటు ఒక బంధం బలంగా ఉండడానికి నమ్మకం కూడా అంతే అవసరం అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే పునాది బలంగా ఉంటేనే ఇల్లు దృఢంగా  ఉంటుంది.. ఇక బంధం లో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే ఆ బంధం కలకాలం సంతోషంగా ఉంటుంది అని చెప్పాలి. చిన్న విషయంలో కూడా అనుమానం మొదలైన  ఇక అది ఎక్కడ వరకు దారితీస్తుందో కూడా మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి అనుమానం పెరిగి పెద్దదై చివరికి ఒకరి ప్రాణాలను ఒకరు తీసుకునేంత వరకు కూడా దారి తీస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాము.


 ఇలా నేటి రోజుల్లో అనుమానంతో జరుగుతున్న దారుణమైన హత్యలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అనుమానం ఏకంగా మూడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది అని చెప్పాలి. భార్యపై అనుమానంతో ఐదు నెలల పసి పాపను గొంతు నులిమి చంపిన భర్త ఇక భార్యని కూడా చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇసుకపల్లి పాలెం లో వెలుగు చూసింది అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే ఇసుకపల్లి పాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆవుల మురళి అదే గ్రామానికి చెందిన స్వాతిని ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నాడు.


 వీరి సంసారం ఎంతో సాఫీగా సాగిపోయింది. ఈ క్రమంలోనే  వీరికి ఒక పాప కూడా పుట్టింది. అయితే తన భార్యకు పుట్టిన పాపకు తండ్రిని నేను కాదు అంటూ అనుమానించడం  మొదలుపెట్టాడు మురళి. ఇక దీనికి మురళి తల్లిదండ్రులు, సోదరి కూడా ఆజ్యం పోస్తూ వచ్చారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భార్య భర్తల మధ్య గొడవలు జరిగాయి. ఇటీవలే పుట్టింటికి వెళ్ళింది స్వాతి. మాయమాటలతో మళ్లీ మెట్టినింటికి తీసుకువచ్చాడు మురళి. ఈ క్రమంలోనే ఇటీవల ఐదు నెలల పాప భార్య గొంతు నులిమి చంపేశాడు.  చివరికి పోలీసులు ఏం చేస్తారనే భయంతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: