సాధారణంగా పాము అనే పేరు వినిపిస్తే చాలు ప్రతి ఒక్కరు వణికి పోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక వెళ్లేదారిలో ఎక్కడైనా విషపూరితమైన పాము కనిపించింది అంటే చాలు వాటి వైపు వెళ్లడాన్ని కూడా మానుకుంటారు . ఒకవేళ పాము మనం ఉన్న చోటికి వస్తే ప్రాణాలు గాల్లో కలిసి పోయినంత పని అవుతూ ఉంటుంది. ఇక వర్షాకాలం కావడంతో ఇటీవల కాలంలో ఇళ్లలోకి పాములు విషపూరితమైన కీటకాలు రావడం లాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి.  ఇక్కడ ఒక కుటుంబానికి ఇలాంటి ఒక వింత అనుభవం ఎదురైంది.


 ఏకంగా వారు ఉంటున్న ఇంట్లోనే ఒక వింత శబ్దం వినిపించింది. ఏంటో వారికి అర్థం కాలేదు. ఇక రోజురోజుకు శబ్దం ఎక్కువ కావడంతో ఏంటా అని చెక్ చేసి ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఆ కుటుంబం. వాళ్ళింట్లో ఎంతో ప్రమాదకరమైన విషపూరిత పాములు కనిపించాయి. దీంతో ఆ కుటుంబం మొత్తం ఒక్కసారిగా భయంతో వణికి పోయింది. ఆ ఇంట్లో కనిపించిన పాము పేరు క్రైట్ స్నేక్. అత్యంత ప్రమాదకరమైన పాములలో ఇది కూడా ఒకటి అని చెప్పాలి. ఇండియా తో పాటు బంగ్లాదేశ్ పాకిస్తాన్ దేశాలలో ఈ పాముకాటు కారణంగా మరణించిన వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది.



 ఒడిషాలోని ఓ ఇంట్లోకి అత్యంత విషపూరితమైన రెండు క్రైట్ స్నేక్ లు దూరయ్. రూమ్ లో వింత శబ్దాలు రావడంతో గమనించిన ఇంట్లో వారు వెళ్లి చూసి అక్కడ పాములు ఉండటం గమనించి ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే  స్నేక్ క్యాచర్ కి  సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా రెండు పాములు పట్టుకుని ఆటవీ ప్రాంతంలో వదిలేశాడు. దీంతో ఆ కుటుంబం ఊపిరిపీల్చుకుంది అని చెప్పాలి. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: