ప్రముఖ యూట్యూబ్ నటిగా టెలివిజన్ నటిగా పేరు సంపాదించిన సిరి హన్మంతు సోషల్ మీడియా లో సిరి పాపులారిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ 3 సీజన్ ద్వారా కూడా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే పలు రకాల సినిమాలు ,వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బాగానే పాపులారిటీ అందుకుంది. సోషల్ మీడియాని ఉపయోగిస్తూ చాలామంది సరికొత్త ఆదాయ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే యాంకర్ విష్ణు ప్రియ, అషు రెడ్డి, శ్రీ రెడ్డి మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ని మొదలుపెట్టారు. ఇప్పుడు వారి బాటలోనే సిరి హన్మంతు కూడా అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.


సోషల్ మీడియాని కేవలం పబ్లిసిటీ కోసమే కాకుండా ఇలా పక్కా కమర్షియల్ ఆదాయ వనరుగా మార్చేసుకుంటున్నారు. సిరి షేర్ చేసిన ఎక్స్క్లూజివ్ ఫోటోలు, షూటింగ్ సంబంధించిన సీన్స్, పర్సనల్ అప్డేట్ లతో పాటు మరికొన్ని వీడియోలు చూడాలి అంటే నెటిజన్స్ సైతం నెలకు రూ. 449 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి నెల కూడా సుమారుగా  రూ.2  లక్షల రూపాయల వరకు సిరి కి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది. ఇలా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రమే స్పెషల్ లైవ్ సెక్షన్లు కూడా రిప్లై కూడా అందుతాయని ఆమె వెల్లడించింది.


ఇప్పటికే యాంకర్ విష్ణు ప్రియ ఇలాంటి ప్రయత్నం చేసి చాలా విమర్శలు ఎదుర్కొన్నది. సిరి హన్మంతు తన వీరాభిమానుల కోసమే ఈ వీఐపీ యాక్సెస్  సదుపాయాన్ని సైతం  అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలియజేసింది. దీనిపైన కూడా సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. చాలామంది మాత్రం సోషల్ మీడియాలో ఇలాంటివి ఏంటని అసహనాన్ని తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇంస్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: