
అయితే ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాలలో కూడా స్నేక్ క్యాచర్లు అందుబాటులో ఉన్నారు. దీంతో ఇక పరిసర ప్రాంతాల్లోకి పాము వచ్చిందంటే చాలు వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించి ఇక పాములను పట్టించడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే పెద్దవాళ్లయితే పాము నుంచి ప్రమాదం ఉందని ముందే గ్రహించి ఇలా ఇక జాగ్రత్తగా పాములు పట్టుకోవడం లేదంటే ఇంట్లో నుంచి తరిమికొట్టడం చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలయితే పాముతో ఉన్న ప్రమాదం గురించి తెలియదు. కాబట్టి చివరికి పాము కాటుకు గురవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మూడేళ్ల బాలుడు మాత్రం ఏకంగా పామునే చీల్చి చెండాడాడు.
ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లాలో మాద్నాపూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దినేష్ అనే వ్యక్తి ఆ గ్రామంలో ఉంటున్నాడు. అతడి మూడేళ్ల కొడుకు ఇటీవల ఇంటిముందు ఆడుకుంటున్న సమయంలో అతని వద్దకు ఒక పాము వచ్చింది. దీంతో పామును చూసి ఆట వస్తువు అనుకున్న బాలుడు.. ఆ పామును నోటితో కొరికి చంపేశాడు. ఇక ఆ తర్వాత అతను స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నాడు. ఇక ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.