సీఎం జగన్ కచ్చితంగా సీబీఐ విచారణ ఎదుర్కొవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూడా  సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు. 2014 లో తనకు సంబంధించిన అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొని  జైలుకు వెళ్లారు.  జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కోర్టు ఆదేశాలతో  ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టులో హజరయ్యే వారు.  జగన్ సీఎం అయిన తర్వాత సీబీఐ విచారణకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. సీఎం హోదాలో బీజీగా ఉండి రాలేకపోతున్నానని గతంలో సీబీఐకి లేఖలు సమర్పించారు.


ఇన్నాళ్లకు అక్రమాస్తుల కేసులో కాకుండా వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఎదుట సీఎం జగన్ హాజరయ్యే అవకాశం ఉంది. వైఎస్ వివేకా హత్య జరిగిన తర్వాత జగన్ కు ఏమైనా ఫోన్లు వచ్చాయా?  కృష్ణ మోహన్ రెడ్డి, అజయ్ కల్లం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ నలుగురు కూర్చున్నపుడు జగన్ కు ఫోన్ వచ్చిందని ఆంధ్రజ్యోతి తన పత్రికలో రాసుకొచ్చింది.


మ్యానిపెస్టో మీటింగ్ కు సంబంధించి కూర్చున్నపుడు ఫోన్ వచ్చిందని అజయ్ కల్లం చెబితే, అభ్యర్థుల ఎంపిక విషయంలో మాట్లాడుతున్నపుడు వచ్చినట్లు మరో సమాచారం. అయితే కేసు తిరిగి తిరిగి జగన్ మెడకు చుట్టుకునేలా ఉందని కొంతమంది మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


అయితే వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ లో ఉన్నారు. ప్రధాన నిందితుడిగా ఆయనను సీబీఐ విచారిస్తోంది. ఇంతకు ముందు విచారించిన సీబీఐ అధికారి వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడని తేల్చింది. వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా ఈ హత్యలో భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. సొంత చిన్నాన్న హత్య కేసులో వైఎస్ కుటుంబం వారే ఉండటంతో ప్రజల్లోకి నెగటివ్ ప్రచారం వెళుతోంది. ప్రస్తుతం ఈ కేసులో జగన్ సీబీఐ విచారణ ఎదుర్కొంటే వైసీపీకి ఎదురు దెబ్బే. ప్రతి పక్షాలు దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతాయనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: