
ఇది ముప్పని భావించిన అమెరికా అప్పటి నుంచి మన దేశంతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. తద్వారా జపాన్ సెక్యూరిటీని కొంతమేర పటిష్ఠం చేయగలిగింది. అందులో భాగంగానే జపాన్ కు సర్వైలైన్స్ పెట్టిన హెలీకాఫ్టర్ లు కూలడం ఇప్పుడు సంచలనంగా మారింది. వీటిని చైనా కూల్చిందా లేక అమెరికా తప్పిదమా అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు.
తాజాగా జపాన్ లో ఘెర ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ సైనిక విధుల్లో ఉన్న అమెరికన్ సైన్యానికి చెందిన హెలికాఫ్టర్ ఒక్కటి కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో ఎనిమిది మంది ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జపాన్ తీర ప్రాంతమైన యుకుషిమా ద్వీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారు.. ప్రాణ నష్టం జరిగిందా అనే విషయంపై గోప్యత పాటిస్తున్నారు. ఇవాకునీ అనే ప్రాంతంలో ఉన్న అమెరికా ఆర్మీ బేస్ నుంచి టేకాఫ్ అయ్యి కడేనా బేస్ కు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది అని జపాన్ వార్తా సంస్థ పేర్కొంది.
కాగా అమెరికాకు చెందిన ఎస్ప్రే సంస్థ విస్తరణ జపాన్ లో వివాదస్పదంగా మారింది. ఈ హైబ్రిడ్ విమానం ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ విమర్శలను జపాన్, అమెరికా ప్రతినిధులు కొట్టే స్తున్నారు. ఇదిలా ఉండగా ఆగస్టులో ఇదే విమానం ఉత్తర ఆస్ర్టేలియా తీరంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు యూఎస్ సిబ్బంది మరణించారు. మరి ఇవి కూల్చి వేయబడ్డాయా.. లేక సాంకేతిక తప్పిదం కారణంగా జరిగిందా అనేది అమెరికా చెప్పడం లేదు.