ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు నాయకుడు అంటూ ఆ మధ్య ఓ సినిమాలో పవన్ కల్యాణ్‌ డైలాగ్ ఉంది. అది అక్షరాలా నిజం.. అనువుగాని చోటు అధికుల మనరాదు అని మన వేమన శతకకారుడు కూడా ఎప్పుడో చెప్పాడు కదా.. మొదట్లో కాస్త మొండి పట్టుదలకు పోయే తత్వం ఉన్న జగన్.. ఆ తర్వాత క్రమంగా మారుతున్నారు. ఏదైనా విషయంలో తప్పు జరిగితే దాన్ని దిద్దుకునే అలవాటు నేర్చుకుంటున్నారు.


మాజీ సీఎం రోశయ్యకు సంతాపం విషయంలో ఇది మరోసారి రుజువైంది. ఇటీవల మాజీ సీఎం రోశయ్య మరణించిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత మంత్రి గౌతంరెడ్డి కూడా కాలం చెందారు. అయితే ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఇలా సమావేశాలు ప్రారంభమైన సమయంలో.. ఆ మధ్య కాలంలో మరణించిన సభ్యులకు సంతాపం తెలుపుతూ తీర్మానాలు పెట్టడం ఆనవాయితీ.. సత్సంప్రదాయం.


మొన్న అసెంబ్లీ ప్రారంభమైనప్పుడు మంత్రి గౌతంరెడ్డికి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టిన ప్రభుత్వం.. ఎందుకనో మాజీ  సీఎం రోశయ్యను మాత్రం మరిచింది. ఇది అధికారుల తప్పిదమో.. ఏమో తెలియకాదు.. తప్పు జరిగిపోయింది. దీనిపై ఆర్యవైశ్య వర్గం నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. జగన్ సంతాపాల్లోనూ కులం చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తమైంది. నిజమే.. ఇది తీవ్రమైన నిర్లక్షమే.. కానీ.. ఆర్య వైశ్య జేఏసీ ప్రకటనతో జగన్ టీమ్ అలర్ట్ అయ్యింది.


తప్పు దిద్దుకునే మార్గం చూసింది. సమావేశాలు కొనసాగుతున్న సమయంలో మాజీ సీఎం రోశయ్యకు సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. అంతేకాదు.. రోశయ్య గురించి జగన్ నాలుగు మంచి మాటలు చెప్పారు. తన తండ్రి వైఎస్‌తో రోశయ్యకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. అలా.. మొత్తానికి జగన్ తప్పు దిద్దుకున్నారు. తప్పులు చేయడం అందరూ చేస్తారు.. మేం చేసిందే రైటని మూర్కులు వాదిస్తారు.. కొందరే ఆ తప్పులు దిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు జగన్ చేసింది అదే.

మరింత సమాచారం తెలుసుకోండి: