వినాయక చవితి వస్తోంది.. వీధివీధిలోనూ గణేశ్‌ విగ్రహాలు కొలువు తీరే సమయం వచ్చేసింది. అయితే.. ఏపీలో దశాభ్ధాల తరబడి ఆనవాయితీగా ప్రశాంతంగా  చలువ పందిళ్లు ఏర్పాటు చేసుకోవడం అలవాటే.. కానీ.. వినాయక నవరాత్రులు నిర్వహించే  ఉత్సవ కమిటీలకు తాజాగా ప్రభుత్వం నిబంధనలు పేరుతో  పోలీసులు ఉత్సవ కమిటీలను భయబ్రాంతులను చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.


ఇలా భయపెట్టడం మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  సోము వీర్రాజు  సీఎం జగన్ కి బహిరంగ లేఖ రాశారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో పల్లె పల్లెలో వీధిలో పట్టణ, నగరాల్లోని  అన్ని కూడళ్లలో జరుపుకోవడం అనాదిగా వస్తున్నటువంటి హిందూ ధర్మ ఆచారం అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  సోము వీర్రాజు. కానీ.. ఈ సంవత్సరం వినాయక చవితి వేడుకల్లో డీజే సౌండ్ సిస్టంగాని, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలుగాని జరపటానికి వీలు లేకుండా చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  సోము వీర్రాజు మండిపడ్డారు.


మండపం నిర్వాహకులు అఫిడివిట్లు ఇవ్వాలని, నిర్వాహకులు సంతకాలతో ముందస్తు హామీ పత్రం తప్పనిసరి అంటూ అర్థం లేని నిబంధనలు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  సోము వీర్రాజు మండిపడుతున్నారు. అధికారులు నిబంధనల పేరుతో  ఒత్తిడి చేయడాన్ని  హెచ్చరించడాన్ని బీజేపీ  ఖండిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  సోము వీర్రాజు తన లేఖలో పేర్కొన్నారు. చవితి ఉత్సవాలను వాటికి కావలసినటువంటి సౌకర్యాలను ఎటువంటి రుసుమును లేకుండానే ఎందుకు ఈ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేకపోతుందో  వివరించే ధైర్యం ఉందా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  సోము వీర్రాజు తన లేఖలో ప్రశ్నించారు.


గణేశ్ పందిళ్లను ఎప్పటిలాగానే నిర్వహించుకునేలా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే భారతీయ జనతా పార్టీ వినాయక చవితి ఉత్సవాలు నిరాటంకంగా జరుపుకోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి  తెస్తుందని.. పెద్ద ఎత్తున ప్రజాఉద్యమాన్ని చేపడతామని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  సోము వీర్రాజు  హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: