
పార్టీకి అంకిత భావంతో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర మొదలు పెట్టడంతోనే ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. ప్రత్యర్ధులతో సహా అందరికీ ఈ మార్పు కొట్టొచ్చినట్లుగా ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రత్యర్థులతో సహా కొంతమందిని, ఇదివరకు తనని విమర్శించిన వారిని ఎవరినీ కూడా ఇప్పుడు నోరెత్తకుండా చేసుకొస్తున్నారు నారా లోకేష్.
తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొన్నటి వరకు, ఇంకా ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబునాయుడు చేతిలోనే ఉన్నాయి. అయితే అవి ఇప్పుడు నారా లోకేష్ కి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన దగ్గర పార్టీని నడిపే ఒక సత్తా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గానికి కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మొన్న జరిగిన మహానాడు సభకు కూడా, పాదయాత్రలో ప్రజల మధ్యన ఉన్నా కూడా ఆయన ఆ సమావేశానికి హాజరయ్యారు..
ఇప్పటివరకు ఆయనను విమర్శిస్తూ టార్గెట్ చేస్తూ వచ్చిన వైఎస్ఆర్సిపి శ్రేణులు ఆయనలోని రాజకీయ పరిణితిని చూసి ఇప్పుడు ఆయనని మరో రకంగా టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడుని ఆ రకంగా టార్గెట్ చేసుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు ఆయనతో పాటు నారా లోకేష్ ని కూడా టార్గెట్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా ఆయన రేంజ్ ను ఆపోజిట్ లో పెంచుతున్నట్లే అంటున్నారు కొంతమంది. తెలుగుదేశానికి రెబల్ గా మారినటువంటి వెంకట్ అనే వ్యక్తి మొన్న కార్యకర్తలందరి మధ్యలోనే ఒరేయ్ లోకేష్ అని పిలుస్తూ రచ్చ చేయడం వెనకాల వైసీపీ శ్రేణుల రాజకీయపరమైన భయం ఉందని అంటున్నారు.