ర‌వి కాంచ‌ని చోట క‌విగాంచును....క‌వికూడాగాంచ‌ని చోట జ‌ర్న‌లిస్టు గాంచును అని...జ‌ర్న‌లిజంలో నానుడి. జ‌ర్న‌లిస్టుకు ఉండాల్సిన ల‌క్ష‌ణం కూడా అదే. అయితే బాధ‌ల‌ను..సంతోషాల‌ను... మంచి-చెడుల‌ను ఇలా స‌మ‌స్త స‌మాచారాన్ని స‌మాజానికి తెలియ‌జేప్పేందుకు అహర్నిశ‌లు క‌లంతో క‌వాతు చేసే జ‌ర్న‌లిస్టుల కడుపులు ఆక‌లితో అల‌మ‌టిస్తున్నాయి. కాస్త సంస్థ‌ల ఉద్యోగుల‌క‌యితే ఇప్ప‌టికిప్పుడు ఆక‌లికి వ‌చ్చిన క‌ష్ట‌మేమీ లేకున్నా..మండ‌ల‌స్థాయి విలేఖ‌రుల‌కు(కంట్రిబ్యూట‌ర్ల) ప‌రిస్థితి ఇదే. సంస్థ‌ల నుంచి ఎలాగు డేట్‌లైన్ నిలిచిపోయింది.(అది కూడా ఇచ్చేవి బ‌హు అరుదు..ఒక‌టి రెండు త‌ప్పా)

 

క‌రోనా సునామీతో  బ‌తుకులు నేడు ఎందుకు కొర‌గాకుండా పోతున్నాయ్‌...న‌మ‌స్తేలు త‌ప్పా...అన్నం తిన్న‌వా అన్నా అని ఏ నాయ‌కుడు ఫోన్ చేసి అడ‌గ‌డం లేదు. ప్ర‌భుత్వమైతే త‌మ ప‌ని కాద‌న్న‌ట్లుగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. కొన్ని యూనియ‌న్ల ద్వారా జ‌రుగుతున్న సాయం గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిది. వారిచ్చే సామాను నాలుగు రోజుల‌కు మించ‌దంటే అతిశేయోక్తి కాదు.  అందులో ఏమన్నాయంటే.. 5 కిలోల బియ్యం, నూనె ప్యాకెట్​, పిండి, చాపత్తా, చక్కెర, పసుపు ఇలా ఉన్నాయి. ఈ సరుకుల ధర మొత్తం ఎంతుంటుందంటే.. రూ. 400 వరకూ మించ‌దు. క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన వార్త‌ల క‌వ‌రేజి కోసం ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెడుతున్న జ‌ర్న‌లిస్టుల‌కు ద‌క్కుతున్న బ‌హుమానం ఇదేనా..?

 

ప్రింట్ మీడియా ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మీడియా సంస్థ‌ల నుంచి క‌నీస స‌హ‌కారం అంద‌డం లేదు. యాడ్స్ తీసుకురావాల‌ని వారి ద్వారా జిల్లాల‌వారీగా  కోటానుకోట్ల రూపాయ‌లు వెన‌కేసుకున్న‌సంస్థ‌లు ఇప్పుడు న‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని ఉన్న‌ప‌లంగా ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం మొద‌లుపెడుతున్నాయి. ఇక డేట్‌లైన్ వాళ్ల ప‌రిస్థితి ఎంటో అర్థం కావ‌డం లేదు. లాక్‌డౌన్ త‌ర్వాత సంస్థ‌లు తెరుచుకుంటే ఎలా ఉంటుందో చెప్ప‌లేం. ఇటీవ‌ల ఒక‌ట్రెండు సంస్థ‌ల్లో డెస్క్లో ప‌నిచేసే కొంత‌మంది స‌బ్ ఎడిట‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టేశారు. ఆ స‌మయంలో కొంత‌మంది ఎదురు ప్ర‌శ్నించిన వారికి సంస్థల బ్రాంచి మేనేజ‌ర్ల ఇదేనా గ‌వ‌ర్న‌మెంటు ఉద్యోగ‌మా ఎల్ల‌కాలం ఉంచుకోవ‌డానికి అంటూ విచిత్ర‌మైన స‌మాధానం వ‌చ్చిందంట‌. జ‌ర్న‌లిస్టు బ‌తుకు గాలిలో దీప‌మైంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: