భార‌త్‌లో వ‌ల‌స కార్మికులు ఎన్నో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఉత్త‌ర, ఈశాన్య భార‌తదేశంలోని రాష్ట్రాల నుంచి మ‌హారాష్ట్ర‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, రాష్ట్రాల్లో ఉపాధి కోసం వ‌చ్చిన వారు కోట్ల‌ల్లో ఉన్న‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. లాక్‌డౌన్ కార‌ణంగా వీరంతా స్వ‌రాష్ట్రాల‌కు వెళ్ల‌లేక‌..వ‌ల‌స వ‌చ్చిన రాష్ట్రాల్లో స‌రైన వ‌స‌తుల్లేక ఉండ‌లేక పోతున్నార‌ని ఇప్ప‌టికే ప‌లు నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. భారత్‌లో సుమారు 4 కోట్ల మంది వలస కార్మికులపై లాక్‌డౌన్‌ ప్రభావం పడిందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. ప్ర‌పంచ బ్యాంకు తాజాగా విడుద‌ల చేసిన నివేదిక  ‘కొవిడ్‌-19 క్రైసిస్‌ త్రూ ఎ మైగ్రేషన్‌ లెన్స్‌’లో భార‌త్‌లోని వ‌ల‌స కార్మికుల స్థితిని వివ‌రించింది.  

 

అంతర్జాతీయ వలసల కంటే భార‌త్‌లో అంతర్గత వలసలు రెండున్నర రెట్లు ఎక్కువగా ఉండ‌టం గ‌మ‌న‌ ఉన్నట్టు వివరించింది. లాక్‌డౌన్‌, ఉపాధి లేమి, భౌతికదూరం పాటించడం వంటి కారణాలు అంతర్గత వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపినట్టు వివరించింది. ఇక ఆర్థికంగా చాలా న‌ష్ట‌పోతున్నార‌ని పేర్కొంది. వేత‌నాలు రాక‌పోవ‌డంతో చాలామంది కార్మికులు క‌నీస అవ‌స‌రాలు తీర్చుకోలేక పోతున్నార‌ని పేర్కొంది. భార‌త ప్ర‌భుత్వం వ‌ల‌స కార్మికుల‌ను ఆదుకునే చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని నివేదిక‌లో తెలిపింది. ఇందుకోస‌ నగదు బదిలీ స్కీంల‌ను చేప‌ట్టాల‌ని సూచించింది. 

 

నిజానికి వ‌ల‌స కార్మికుల క‌ష్టాలు క‌రోనాతో రెట్టింపు అయ్యాయ‌నే చెప్పాలి. గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లేనే చాలామంది కార్మికులు వంద‌ల కిలోమీట‌ర్ల మేర లాంగ్‌మార్చ్‌గా స్వ‌రాష్ట్రాల‌కు చేరుకుంటున్నారు. ఇక లాక్‌డౌన్‌కు ఇప్ప‌ట్లో తెర‌ప‌డేలా లేద‌న్న భ‌యాలు వ‌ల‌స‌కార్మికుల‌ను వెంటాడుతున్నాయి. వాస్త‌వానికి ప‌రిస్థితికి అనుకూలంగా ఉండ‌టంతో ఏం చేయాలో అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. కుటుంబాలు ఒక‌చోట‌..తాము ఒక‌చోట ఉన్నామని తీవ్ర ఆవేద‌న చెందుతున్నారు. ఎక్క‌డివారిని అక్క‌డికి చేర్చాల‌నే డిమాండ్ రోజు రోజుకు వ‌ల‌స కార్మికుల నుంచి అధిక‌మ‌వుతోంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: