ఈ క్రమంలోనే ఈ నెల 17న చర్చించేందుకు రెడీ అయింది. అయితే.. ముందు చూపిన అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించిన కేంద్రం. తర్వాత..తీసేసింది. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన బీజేపీ నేత.. ఎంపీ.. జీవీఎల్ నరసింహారావు.. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. పొరపాటున కేంద్ర ప్రబుత్వం అజెండాలో పెట్టి ఉంటుందని అన్న ఆయన.. తమకన్నా.. కేంద్రంలోని పెద్దలు.. ప్రధాని, హోం మంత్రిపైనే ఎక్కువగా బాధ్యత ఉందన్నారు. అంటే.. ఆయన ఉద్దేశం.. ప్రత్యేక హోదా అంశంపై.. మోడీ, షాలనే స్పందించాలని అన్నారు.
కానీ, వాస్తవానికి కేంద్రంలోనని పెద్దలకు.. ఏపీతో సంబంధం లేదు. ఎందుకంటే..వారు ఇక్కడి ఎంపీలపై ఆశలు పెట్టుకోలేదు. పార్టీని ముందుకు నడిపించేవారు కూడా ఇక్కడ లేరని.. వారికి స్పష్టంగా తెలుసు. అందుకే.. పొరుగున ఉన్న.. తమిళనాడుపైనా.. ఇతర రాష్ట్రాలపైనా ఆధారపడుతున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీని కేంద్రంలోని పెద్దలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించాల్సిన బాధ్యత వారిపై ఎందుకు ఉంటుంది? ఇదే విషయాన్ని జీవీఎల్ఎందుకు ఆలోచించడం లేదు. పదవులు కావాల్సి వస్తే.. ఏపీ నుంచి వస్తున్నారు. కానీ, ఏపీకి సంబంధించిన అంశాలు... సమస్యలపై మాత్రం స్పందించేందుకు నాయకులు వెనుకాడుతు న్న పరిస్థితిని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. మీకు ఏదైనా ప్రయోజనాలు కావాల్సి వచ్చినప్పుడు.. ఏపీ నుంచి అన్నింటినీ వాడుకుంటున్నారు. కానీ, ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా అంశాన్ని మాత్రం కేంద్రంపైకి ననెట్టేసి.. మాకు సంబందం లేదు.. అన్నట్టుగా వ్యవహరించడం.. ఏమేరకు సమంజసం? అనేది ప్రశ్న. మరి దీనికి జీవీఎల్ ఏం చెబుతారోచూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి