అయితే.. చంద్రబాబు ఎప్పుడూ చెబుతున్నదే అయినా.. తాజాగా ఆయన బాగా స్ట్రెస్ చేసి మరీ చెప్పారు. అదేసమయంలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని కూడా వివరించారు. ఇలా.. ఎందుకుచెప్పారు? అనేది చర్చ! వాస్తవానికి ఆయన ఇవే విషయాలను ఏడాది కాలంగా చెబుతూనే ఉన్నారు.కానీ, ఇప్పుడు వీటికి కొన్ని ఇమేజ్‌లు.. వీడియోలను కూడా జత చేసి చూపించారు. దీనికి కారణం.. ఇప్పటి వరకు నాయకులు ఎన్ని చెప్పినా.. కదలడం లేదు. చివరకు పదవులు పీకేస్తాను.. అని అన్నా కూడా వారు స్పందించడం లేదు.
అంతేకాదు.. హెచ్చరికలు కూడా పనిచేయడం లేదు. దీంతో వారిని నయానో.. భయానో.. తన దారిలోకి తెచ్చుకోవడం తప్ప వేరే దారి కనిపించడం లేదు. దీంతో.. చంద్రబాబు తాజాగా ప్రజల నుంచి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేక ఫీడ్ బ్యాక్‌ను వీడియోలు, ఇమేజ్‌ల రూపంలో తమ్ముళ్లకు వివరించారు. ``ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని చెబుతుంటే.. మీరు వినిపించడం లేదు. ఇవి చూడండి.. ప్రజలు ఎలా తిట్టిపోస్తున్నారో.. ఇప్పటికైనా.. కదలండి.. నియోజకవర్గాల్లో ఉండండి. వచ్చేది మన ప్రభుత్వమే`` అని నేతలకు నూరిపోస్తున్నారు. పని చేయని వారిని పక్కన పెట్టేస్తానని పదే పదే వార్నింగ్లు కూడా ఇస్తున్నారు.
దీంతో నాయకులు.. ఇప్పటికైనా కదులుతారని, ఆయన భావిస్తున్నారు. మరి ఇది ఏమేరకు ఫలిస్తుందో చూడాలి. అయితే.. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులకు.. ప్రజానాడి తెలియదా ? చంద్రబాబు చెప్తేనే తప్ప.. వారికి ప్రజలు ఏమనుకుంటున్నారో.. తెలియని పరిస్థితి ఉందా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి