ఏపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చే నిత్యావసరాల్లో కోతలు విధిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవాలు లేవని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు కొన్ని పత్రికలు,ఛానళ్లలో వచ్చిన వార్తలను ఖండించింది. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, సార్టెక్స్ బియ్యం లేదా  సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం, కంది పప్పు, చెక్కర ను పంపిణీ చేస్తున్నట్లు  పౌర సరఫరా శాఖ కమిషనర్ వీర పాండ్యన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కన్న ప్రస్తుత ప్రభుత్వంలో మెరుగైన విధానాల ద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యం, ఇతర సరుకులను పారదర్శకంగా వారి సంతృప్తి మేరకు పంపిణీ చేస్తున్నట్లు పౌర సరఫరా శాఖ కమిషనర్ వీర పాండ్యన్  తెలిపారు.


2019 నాటికి రాష్ట్రంలో సగటున 1.39 కోట్ల కార్డులు అమలులో ఉన్నాయని పౌర సరఫరా శాఖ కమిషనర్ వీర పాండ్యన్  తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.45 కోట్ల కార్డులు అమలులో ఉన్నట్లు పౌర సరఫరా శాఖ కమిషనర్ వీర పాండ్యన్  తెలిపారు. బియ్యం మీద 2014–19 మధ్య నాటి ప్రభుత్వం 5 ఏళ్లకు  కంది పప్పు, పంచదార పై 568 కోట్లను సబ్సిడీ ఇచ్చిందని పౌర సరఫరా శాఖ కమిషనర్ వీర పాండ్యన్  తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో  కంది పప్పు, పంచదార పై 1891 కోట్ల రూపాయలను సబ్సిడీ నిమిత్తం ఖర్చుచేసినట్లు తెలిపారు.


ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో కంది పప్పు ధర కిలో 115 రూపాయలు  ఉందన్న పౌర సరఫరా శాఖ కమిషనర్ వీర పాండ్యన్ .. ప్రభుత్వం రాయితీగా కిలోకు 48 రూపాయలు  భరిస్తూ, కార్డుదారులందరికీ కిలోకు 67 రూపాయల చొప్పున సబ్సిడీకి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా విపత్తు సమయంలోనూ ప్రజా పంపిణీ పధకాల క్రింద 1.99 లక్షల పప్పు ధాన్యాలను అందరు కార్డుదారులకు 2020 ఏప్రిల్ , నుంచి 2020 నవంబర్ వరకు ఉచితముగా పంపిణీ చేసినట్లు పౌర సరఫరా శాఖ కమిషనర్ వీర పాండ్యన్  తెలిపారు.


ఇలాంటి వాటి కోసం 1795 కోట్లు ఖర్చు చేసినట్లు పౌర సరఫరా శాఖ కమిషనర్ వీర పాండ్యన్  తెలిపారు. గతంలో రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి సరుకులు తీసుకునే పరిస్ధితి ఉందని.. ఇప్పుడు ఇంటింటికీ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు పౌర సరఫరా శాఖ కమిషనర్ వీర పాండ్యన్  వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

pds