
ఈ విషయంలో ఎర్ర గంగిరెడ్డి నాకేమి సంబంధం లేదు, నేనేమీ వారికి డబ్బులు ఇవ్వలేదు అని అనడం. దస్తగిరి ఏమో ఆయనే డబ్బులు ఇచ్చాడు. అందుకే మేము వైఎస్ వివేకానంద ను హత్య చేసామనడం దీనికి తెలుగుదేశం అనుకూల మీడియా పూర్తిగా కథనాలు రాయడం తో విషయం సీబీఐ వరకు వెళ్ళింది. ముఖ్యంగా తెలుగుదేశం అనుకూల మీడియా ఈ హత్య కేసులో ఎవరైతే ఉన్నారో వారి నుంచి ఇంటర్వ్యూలు చేయడం వారిని పైకి కనిపించేలా చేయడంతో విషయం కాస్త ముదిరింది. తర్వాత వాళ్లు మేమే హత్య చేశామని ఒప్పుకోవడం అనంతరం దీని వెనుక ఫలానా వ్యక్తులు ఉన్నారని చెప్పడంతో వివాదం కాస్త రాజకీయ మలుపు తీసుకుంది.
ఓవైపు సీబీఐ విచారణ జరుగుతుండగా ఎర్ర గంగిరెడ్డి భార్య కోర్టుకు వెళ్లి విచారణ ఆపాలని కేసు కూడా వేసింది. ఇదంతా జరుగుతుండగా సీబీఐ కూడా గట్టిగానే విచారణ చేపట్టడంతో అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మనారు. ముందుగానే షెడ్యూలు ప్రకారం వేరే పనులు ఉండడం వల్ల ఇప్పుడు రాలేనని ఐదు రోజుల తర్వాత వస్తానని ఆయన చెప్పారు. ఏదేమైనా వైయస్ వివేకా హత్య కేసును కూతురు సీరియస్ గా తీసుకోవడంతో ఈ కేసు ప్రతాక స్థాయికి చేరుకుంది.