
భారత్ లోకి వస్తున్న ఆయా కంపెనీలు సైతం దాదాపు 16 శాతం నార్త్ ఇండియా వైపే వెళుతున్నాయి. అయితే చైనాలో గతంలో లేబర్లు తక్కువ ధరకు పని చేసే వారు. కానీ చైనాలో ఎవరైతే సంక్షేమ పథకాలు అందుకుంటున్నారో వారు తమ కూలీ రేట్లను అమాంతం పెంచేశారు. దీంతో కూలీల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు పెద్ద ఎత్తున డ్రాగన్ కంట్రీ ఆంక్షలు పెట్టడంతో కంపెనీలు అక్కడి నుంచి తరలిపోతున్నాయి.
ఇం0డియాలో కూడా కూలీల సమస్య ఎర్పడటానికి కూడా ఇదే సమస్య వస్తుంది. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఉచితాలు ఎక్కువయ్యాయి. సంక్షేమం అనే ముసుగులో ప్రజలకు ఉచితంగా డబ్బులు రావడంతో వారు చేసే పనికి కూలీ రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. దీంతో ఇక్కడ ఏదైనా కంపెనీ పెట్టాలన్నా రెండింతల ఖర్చు ఎక్కువవుతోంది. పది మందికి మూడు వేల రూపాయాలు ఇవ్వాల్సి వస్తే.. ప్రస్తుతం 10 వేలు ఇవ్వాల్సి వస్తోంది. రెండోది ల్యాండ్ కాస్ట్ హైదరాబాద్, ఆంధ్రలో ధరలు ఆకాశన్నాంటుతున్నాయి.
భూమి ధరలు, కూలీల రేట్లు రెండు ప్రధానాంశాలుగా కంపెనీలు రాకపోవడానికి ప్రధాన కారణాలు. ఐ ఫోన్లు, యాపిల్ సంస్థలు ఇక్కడ కేవలం 20 శాతం మాత్రమే పెడుతున్నారు. దాదాపు 60 శాతం కంపెనీలు వియత్నాం తరలిపోవడానికి కూడా ఈ రెండే ప్రధాన కారణాలు. కాబట్టి ఉచితాలు, సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని బద్దకస్తులుగా మార్చుతూ ఏదైనా పని చేయాలంటే కూలీలు దొరకని పరిస్థితి ఇక్కడ మొదలైంది.