బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బ్యాంకింగ్ గొడవల కారణంగా మళ్లీ పసిడి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. షేర్ మార్కెట్లో బ్యాంకింగ్ సంబంధించిన షేర్లు విపరీతంగా పడిపోయాయి. దీంతో బ్యాంకుల్లో ఉన్న డబ్బులను తీసి బంగారం కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపించడంతో ఒక్కసారిగా బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి.


బీఎస్సీ, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతం నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు 2546 కోట్లు షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు 2875 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. డాలర్ మారకం విలువ మూడు రూపాయాలు బలహీనపడింది. దీంతో డాలర్ తో రూపాయి విలువ 82.50 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లు మూడు నుంచి 1 శాతం నష్టపోయాయి. ఆరంభంలో నష్టపోయిన యూరప్ సూచీలు ఒక శాతం మెరుగు పడ్డాయి. అమెరికా స్టాక్ మసూచీలు మిశ్రమంగా కదలాడుతున్నాయి.


ఇన్వెస్టర్లు సంపాదగా భావించే బీఎస్సీ విలువ సోమవారం నాటికి 255. 5 లక్షల కోట్ల విలువకు దిగి వచ్చింది. రిలయన్స్ షేర్ శాతం కూడా పడిపోయింది. సోమవారం ఒక్కరోజే సెన్సెక్స్ 361 పాయింట్లు క్షీణించడంతో ఒక్క రోజే ఇన్వెస్టర్లకు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయాలు నష్టపోయినట్లు తెలుస్తోంది. మార్కెట్లో కోచిన్ షిప్ యార్డు రాణించింది. ఇంట్రా డేలో రెండు శాతం పడి పోయి ఏడాది కనిష్టానికి పడి పోయినట్లు తెలుస్తోంది. మొత్తం మీద బంగారం మొన్నటి వరకు 57 వేల రూపాయాల నుంచి 60 వేల కు పెరిగింది. సామాన్య ప్రజలు కొనలేనంత దూరంలో బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి.


స్టాక్ మార్కెట్లో ఏదీ జరిగినా అది బంగారం పెరుగుదలకు కారణమయ్యేలా ఉందని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బ్యాంకింగ్ రంగం అమెరికాలో కుదేలైతే భారత్ లో బంగారం రేట్లు పెరిగాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఉంది కాబట్టి బంగారం ధరలు పెరిగాయని అనుకుంటున్నారు. కానీ పసిడి పరుగులకు బ్రేక్ పడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: