చైనా తైవాన్ విషయంలో త్రిముఖ వ్యుహం పన్నుతోంది. తైవాన్ కు మద్దుతుగా అమెరికా మొదటి నుంచి సపోర్టుగానే ఉంటోంది. ఒక వేళ చైనా తైవాన్ పై యుద్ధం ప్రకటిస్తే అమెరికా, నాటో దేశాలు రంగంలోకి దిగుతాయి. దీంతో చైనా వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంటుంది. చైనా ప్రస్తుతం రెండు మూడు సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. తైవాన్ కు మద్దతిచ్చే ఆరు దేశాలను చైనా తను చెప్పేలా వినేట్లు చేసేసుకుంది. తైవాన్ కు మద్దతిస్తున్న ఆరు దేశాలను చైనా మచ్చిక చేసుకుంది. దీంతో ఈయూ కు సంబంధించిన నేషనల్ ఎలక్షన్ రిసోర్స్ కు సంబంధించిన చెక్ రిపబ్లిక్ స్పీకర్ బృందాన్ని తైవాన్ కు పంపించారు.  


వ్యాపారవేత్తలు, వాణిజ్య వేత్తలు తైవాన్ లో అడుగు పెట్టారు. ఇది 30 సంవత్సరాల బంధాన్ని శాశ్వతం  చేసుకోవడానికే అని చెప్పింది. దీన్ని చైనా తీవ్రంగా తప్పు బట్టింది. సెమీ కండక్టర్ల కోసం పెట్టుబడి పెట్టేందుకు వచ్చారని ఈయూ తెలిపింది. చెక్ రిపబ్లిక్ లో పెట్టుబడి పెట్టేందుకు తైవాన్ సిద్ధమైంది. సెంట్రల్ ఈస్ట్రన్ యూరఫ్ కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలండ్, స్లోవేకియా కూడా తైవాన్ కు మద్దతు ఇస్తున్నాయి.  


లిథువేనియా కూడా తైవాన్ కు మద్దతు ప్రకటిస్తోంది. అయితే సెంట్రల్ యూరప్ వ్యవహారాలే పథక స్థాయికి చేరుకున్నాయి. అయితే వీటిన్నింటిని చైనా నిశితంగా గమనిస్తూనే ఉంది. రాజకీయంగా దెబ్బకొట్టి హంకాంగ్ ను ఎలాగైతే స్వాధీనం చేసుకుందో అదే విధంగా తైవాన్ ను కైవసం చేసుకునేందుకు చైనా సిద్ధపడుతోంది. అందుకే తైవాన్ లో ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఎర వేస్తోంది.


చైనా సామ్రాజ్య వాద విస్తరణ కాంక్షతో రాబోయే కాలంలో చాలా  దేశాలు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. చైనా విస్తరణ వాద కాంక్ష, అమెరికా అగ్రరాజ్య పోకడలు, ప్రపంచ దేశాల వినాశానానికి దారి తీసే విధంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: