ప్రపంచం మొత్తం గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. అమెరికా, యూరప్ దేశాల్లో వేడి వాతావరణంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికంతటికి కారణం పర్యావరణం దెబ్బతినడమే కారణమని తెలుస్తోంది. ఎండలు ఉండాల్సిన చోట వానలు పడుతున్నాయి. చల్లటి వెదర్ ఉండాల్సిన చోట విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. అమెరికాలోని డెత్ వ్యాలీలో ఏకంగా 53 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇంతటి వేడి సమయంలో కూడా టూరిస్టులు ఆ ప్రదేశానికి వెళుతున్నారు. కానీ ప్రపంచం రాబోయే 30 ఏళ్లలో వేడి వాతావరణంతో అల్లాడిపోనుంది.


విపరీతంగా వేడి పెరగడం వల్ల మానవ జీవనానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి. యూరప్ లో  ఒకప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పటికీ పూర్తిగా మారిపోయింది.చల్లటి వెదర్ కు పెట్టింది పేరుగా ఉండే యూరప్ దేశాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి.  63 మిలియన్లకు పైగా హీట్ వార్నింగ్ లకే రాబోయే రోజుల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ప్రతి ముగ్గురిలో ఒకరు హీట్ వార్నింగ్ తో సఫర్ అవుతున్నారు. కాలిపోర్నియాలో విపరీతమైన వేడిగాలులు, కెనడాలో అయితే మంటలు వస్తూ 24 లక్షల ఎకరాలు కేవలం హీట్ వేవ్స్ వల్ల తగలబడిపోయాయంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు దక్షిణ కొరియాలో బీభత్సమైన వరదలకు వందలాది మంది చనిపోతున్నారు. రోడ్లు, భవనాలు, ఆర్థిక నష్టం విపరీతంగా జరుగుతోంది. చైనాలో టైపూన్లు వస్తున్నాయి.


ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ప్రకృతి వైపరీత్యాలే కనిపిస్తున్నాయి. వీటి వల్ల రాబోయే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 230 ట్రిలియన్ డాలర్లు నష్టపోయే అవకాశం ఉంది. పర్యావరణాన్ని పట్టించుకోకుండా ప్రపంచంలోని అన్ని దేశాల ఇష్టారీతిన కాలుష్యాన్ని వెదజల్లే సంస్థలను ఏర్పాటు చేసుకుంటూ పోతుంది. కాలుష్యాన్ని అరికట్టి పర్యావరాణాన్ని కాపాడేందుకు చేయాల్సిన కృషిన మరిచిపోయారు. ప్రతి దేశం బాధ్యతగా తీసుకుని పర్యావరణాన్ని కాపాడితేనే రాబోయే రోజుల్లో భూమిపై మానవ మనుగడ సాధ్యపడుతుంది. లేకపోతే భూమి కూడా జీవం లేని గ్రహంగా మిగిలిపోకమానదు.

మరింత సమాచారం తెలుసుకోండి: