సీఎం రమేశ్ గతంలో తెలుగుదేశం పార్టీ లో ఉన్న చురుకైన కార్యకర్త. కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా ఉన్న ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉండి బీజేపీలో చేరారు. కానీ ఆయన ఆత్మ తెలుగు దేశంలోనే ఉందని మరో సారి నిరూపితమైంది. బీటెక్ రవి పులివెందులలో జగన్ కు వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి. ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. గతంలో సతీశ్ రెడ్డి జగన్ కు వ్యతిరేకంగా పోటీ చేసేవారు. గత సారి ఎన్నికల్లో జగన్ పై బీటెక్ రవి పోటీ చేశారు. అయితే బీజేపీలో ఉన్న సీఎం రమేశ్ జైల్లో ఉన్న బీటెక్ రవిని కలవడం అనేది ఇక్కడ చర్చనీయాంశం.
బీజేపీ పార్టీకిి చెందిన వ్యక్తి సీఎం రమేశ్.. జైల్లో ఉన్న బీటెక్ రవిని కలిసి పరామర్శించడం అంటే పైకి బీజేపీ, లోపల టీడీపీ అనే నానుడిని ఆయన నిజం చేశారన రాజకీయ విమర్శలు వస్తున్నాయి. సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ లాంటి వారు టీడీపీని వదిలి బీజేపీలో చేరారు. అయినా వారిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. గతంలో వైఎస్ చేసిన విధంగానే ప్రస్తుతం సీఎం రమేశ్ కూడా అధిష్టాన వైఖరిని లెక్క చేయకుండా ముందుకు వెళుతున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి