ఆఖరి నిమిషంలో జనసేన అభ్యర్థుల్లో మార్పులు చేశారు  ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మచిలీపట్నం బరిలో మొదటి నుంచి బాల శౌరి ఉంటారని భావించారు. ఈ మేరకు ఆయన గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించారు. అయితే ఆఖరి నిమిషంలో పవన్ తన నిర్ణయం మార్చుకున్నట్లు అర్థం అవుతోంది.


బాలశౌరిని అవనిగడ్డ నుంచి అసెంబ్లీ బరిలో దింపుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు వంగవీటి రాధా పేరు కూడా మచిలీపట్నం ఎంపీ బరిలో బలంగానే వినిపిస్తోంది. తాజా మార్పులను పవన్ మరో రెండు రోజుల్లో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో జనసేన అభ్యర్థులకు సంబంధించి పవన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మొదటి నుంచి బందరు పార్లమెంట్ స్థానానికి వల్లభనేని బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన వైసీపీలో టికెట్ రాలేదని జనసేనలో చేరిపోయారు.


ఆయన అభ్యర్థిత్వం ఖరారైనట్టే అని అంతా భావించారు. జనసేన ఇప్పటికే ఒక ఎంపీ, 18 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మచిలీపట్నం స్థానాన్ని పెండింగ్ లో ఉంచింది. కానీ అనూహ్యంగా అవనిగడ్డ అసెంబ్లీ బరిలో ఆయన్ను దింపుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బాలశౌరి  జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ కావడం తీవ్ర చర్చనీయాశం అవుతోంది.


అప్పట్లో తాడేపల్లి కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు రాగానే వారంతా హుటాహుటినా బయల్దేరి తాడేపల్లి వెళ్లేవారు. ఫోన్ వస్తే చాలు తమ టికెట్ ఉంటుందో.. ఉండదో అనే భయం వారిలో వెంటాడేది. వీటిని ఆసరాగా చేసుకొని ఎల్లో మీడియా తీవ్ర దుష్ప్రచారం చేసింది.  సీఎం జగన్ అభ్యర్థులను ప్రకటించారు. అంతా సద్దుమణిగింది. ఈసారి వంతు కూటమిది అయింది. తాజాగా బాలశౌరి జనసేన కార్యాలయానికి వచ్చారు. ఆయనకి ఏం చెప్పారు.. ఏం హామీ ఇచ్చారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: