అమెరికా దిగ్గజం టెస్లా ఇండియాలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందు కోసం స్థల సేకరణ ఖరారు కోసం  ఓ బృందం భారత్ కు రాబోతుంది. ప్రాథమికంగా టెస్లా పరిశీలనలో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల ఊసే లేదు. అన్నింటికి మించి ముఖ్యంగా ఆటో మొబైల్ పరిశ్రమకు అనుకూలంగా ఉండి. .. పోర్టులు సౌకర్యం ఎక్కువగా ఉన్న ఏపీ గురించి పరిగణనలోకి తీసుకోలేదు.


గతంలో టెస్లా దిగుమతి చేసుకునే కార్లను విక్రయించాలని కేంద్రం భావించింది. అయితే పన్నులు తగ్గించేందుకు మాత్రం అంగీకరించలేదు. మేడిన్ ఇండియా కార్లకు మాత్రమే ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చివరకు.. ప్లాంట్ పెట్టాలని ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ నిర్ణయం తీసుకున్నారు. ఇండియాలో పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా కార్లకు డిమాండ్ పెరుగుతోంది.


అలానే చుట్టుపక్కల దేశాలకు ఎగుమతి అవకాశాలు, చైనాలో టెస్లా ప్లాంట్ కు ఎదురవుతున్న సవాళ్లు అన్నింటిని పరిగణనలోకి తీసుకున్న భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు మస్క్ ఆసక్తిగా ఉన్నారు. అయితే ఏపీలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలను పంపలేదు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో టెస్లా వ్యవస్థాపకుడు పాల్గొంటారని వైసీపీ సోషల్ మీడియా హడావుడి చేసినా అదేమీ జరగలేదు.


ప్రస్తుతం మస్క్ బృందం ఇండియాలో పర్యటించనున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలున్న హైదరాబాద్ లో  తమ పెట్టుబడులు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం.. ఏమైనా ప్రతిపాదనలు పంపుతుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ  మన తెలుగు రాష్ట్రాల్లో ప్లాంట్ ను పెట్టేందుకు తెలుగు రాష్ట్రాల సీఎం లు సహకరిస్తే.. ఇక్కడ యువతకు అపార అవకాశాలు లభిస్తాయి. ఇంటర్ నేషనల్ బ్రాండ్ ఇమేజ్ మనకు ఏర్పడుతుంది. మరికొన్ని పరిశ్రమలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరి  ఆ విధంగా మన సీఎంలు రేవంత్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డిలు దృష్టి సారిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: