వైఎస్‌ జగన్‌.. లీడర్‌గా ఈయన రూటే సెపరేటు. ఒక పట్టాన ఎవరికీ సులభంగా అర్థం కారు. అయితే.. ఆయనకు పులివెందులలో ఓ ప్యాలస్‌ ఉంది. ఇడుపులపాయలో ఇంకో ప్యాలస్‌ ఉంది. ఇక బెంగళూరులోనూ జగన్‌కు ఓ రాజభవనం ఉంది. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌ ప్యాలస్‌ గురించి ప్రపంచమంతా తెలుసు. ఉమ్మడి ఏపీ విడిపోయాక తాడేపల్లికి షిఫ్ట్‌ అయిన జగన్.. అక్కడ కూడా చిన్నపాటి ప్యాలస్‌ కట్టుకున్నారు. ఇటీవల విశాఖకు రాజధాని మార్చాలని భావించిన జగన్.. అక్కడ కూడా తనకో ప్యాలస్‌ ఉండాలని రుషి కొండపై సర్కారు సొమ్ముతో ప్యాలస్‌ కట్టించుకున్నారని విమర్శలు వచ్చాయి.


అబ్బే.. అవి పర్యాటక శాఖ భవనాలు.. సీఎం కోసం కట్టింది కావని వైసీపీ వాళ్లు కవర్‌ చేసుకున్నా.. ఆ ప్యాలస్‌లు కట్టిన తీరు చూస్తే సామాన్య విడిది భవనాలు కావని తెలుస్తూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో జగన్‌ను నిత్యం విమర్శించే ఓ పత్రికాధిపతి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు తన వ్యాసంలో రాశారు. జగన్‌లో సాధారణ లక్షణాలు ఉండివుంటే తన నివాసం కోసం రుషికొండపై 550 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి మాయామహల్‌ నిర్మించుకొని ఉండేవారు కాదని ఆన అంటున్నారు.


తాను నివసించినా నివసించకపోయినా ఊరికో ప్యాలెస్‌ నిర్మించుకోవడం జగన్‌ నైజం అంటున్న ఆ పత్రికాధిపతి.. పూర్వం రాజులు మాత్రమే ఇలా వేసవి, శీతాకాల విడిది కోసం ప్యాలెస్‌లు నిర్మించుకున్నారని గుర్తు చేస్తున్నారు. రుషికొండపై ముచ్చటపడి కట్టించుకున్న ప్యాలెస్‌లోకి అడుగుపెట్టకుండానే జగన్‌ అధికారం కోల్పోయారని... హైదరాబాద్‌, బెంగళూరుల్లో సొంత డబ్బుతో ప్యాలెస్‌లు నిర్మించుకున్నందున అప్పుడు ప్రజలు పట్టించుకోలేదని ఆయన అంటున్నారు.


తాడేపల్లి ప్యాలస్‌ చుట్టూ 30 అడుగుల ఎత్తులో గ్రిల్‌ను నిర్మించుకున్నారంటే జగన్ ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారని భావించాల్సి ఉంటుందని సదరు పత్రికాధిపతి రాసుకొచ్చారు. జగన్‌ మానసిక పరిస్థితిపై మానసిక వైద్యులు పరిశోధనలు చేయవలసిన అవసరం ఉందంటున్నారా పత్రికాధిపతి.


మరింత సమాచారం తెలుసుకోండి: