
అధికారం కోసం తోబుట్టువులు ఒకరినొకరు విశ్వసించరు.. అధికారం కోసం కుటుంబం బంధాలు తెగిపోతాయి అని కొన్ని వేల సంవత్సరాల క్రితం చాణిక్యుడు తన అర్థశాస్త్రంలో రాజకీయ అధికారం కోసం కుటుంబంలో జరిగే వివాదాల గురించి చెప్పాడు. అంటే రాజకీయం అధికారం కోసం ఒకే కుటుంబంలో రక్తం పంచుకు పుట్టిన వారి మధ్య పోరాటాలు, యుద్ధాలు అనేవి కొత్త కాదు.. వింత కాదు. రాజకీయానికి ఉన్న ప్రధాన లక్షణం అదే. ప్రస్తుతం బిఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తే వింత కాదు.. చాణక్యుడు ఏనాడో చెప్పాడు.. అదే ఇప్పుడు జరుగుతుంది అనుకోవాలి. రాజకీయం అనేది రక్త సంబంధీకులు మధ్య చిచ్చు పెట్టడం కుటుంబాలను చేర్చడం ఒకరినొకరు మాట్లాడుకోలేనంత శత్రుత్వం పెంచడం చేస్తుంది. ఇప్పుడు బిఆర్ఎస్ లో అదే జరుగుతుంది. ఈ పోరులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా నలిగిపోతున్నారు.. వాస్తవానికి ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి మధ్యలో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొన్నారు. వాటిని తట్టుకుని నిలబడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే జరిగిన ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.
మరోసారి జరిగిన ఎన్నికలలో విజయం సాధించి తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు సాధించారు. మధ్యలో ఆయన ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్న ఎన్ని కష్టాలు వచ్చినా ..ఎన్ని ఇబ్బందులు పడిన అవన్నీ ప్రత్యర్థుల మీద ఆయన పోరాటాలు చేసి విజయం సాధించినవే. అయితే ఈసారి ఆయనకు సొంత కుటుంబంలోనే రగిలిన చిచ్చు ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పాలి. కవిత అమెరికాలో ఉన్నప్పుడు ఆ తండ్రి కేసీఆర్‌కు రాసిన లేక లీక్ అవడంతో బిఆర్ఎస్ లో పరిణామాలు చక చక మారిపోతున్నాయి. పైగా ఆమె కాంగ్రెస్ కోవార్డు అన్నట్టుగా కేటీఆర్ ప్రెస్మీట్లో పరోక్ష ఆరోపణలు చేశారు. దీనికి కవిత స్పిరియస్ గా స్పందించారు. కేటీఆర్ కు పార్టీ నడిపే సామర్థ్యంలేదని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఘాటుగా స్పందించారు. ఈ వ్యవహారంతో కల్వకుంట్ల ఫ్యామిలీ రాజకీయాలు బహిరంగం అయ్యాయి.
అధికారం కోసం కుటుంబం రోడ్డున పడుతుందని అందరికీ అర్థమయింది.. వాస్తవానికి బీఆర్ఎస్ లో కవిత అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. తనను పార్టీ దూరం పెడుతున్నారని.. రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని చేస్తున్నారని ఆమె బలంగా నమ్ముతున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయి. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి జైలు నుంచి వచ్చాక ఆమెను బిఆర్ఎస్ రాజకీయాలలో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఆమె ఆ తర్వాత సడన్గా తెలంగాణ జాగృతి పేరుతో రాజకీయం చేయడం ప్రారంభించారు. ఇప్పుడు సొంత పార్టీ తీసుకు వెళుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకు కవిత పట్ల కెసిఆర్ చూపిన వివక్షే కారణం అని బీఆర్ఎస్ లోనే కొందరు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా తన కుటుంబంలోనే చిచ్చు రగలడం తో కేసీఆర్‌కు ఈ వారసత్వ పోరు పీకలమీదకు వచ్చేసింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు