
తెలంగాణ లో గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఇక్కడ అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఎలాగైనా విజయం సాధించాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రేవంత్ అయితే ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అటు బీఆర్ఎస్ క్యాండెట్ ను ఎలాగైనా గెలిపించాలని .. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకున్నారు. పేరుకు మాత్రమే ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య నడుస్తున్నా .. ఇంటర్నల్ గా ఇది కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి పేరుగా నడుస్తోంది.
అయితే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతుంటే నోటిఫికేసన్ వచ్చినా బీజేపీలో చలనం లేదు. ఆ మాటకు వస్తే ఇక్కడ బీజేపీ గెలుపు కాదు.. నామినేషన్ వేయకుండానే చేతులు ఎత్తేసిందని చర్చలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే సర్వేలు, హడావిడి మొదలు పెట్టింది. అటు మజ్లిస్ పోత్తు పై ఇప్పటికే ఓ అవగాహన కుదిరిందని అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించింది. కానీ బీజేపీ ఈ ఉప ఎన్నికపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు లేదు.
జూబ్లిహిల్స్ లో బీజేపీ చేస్తున్న రాజకీయం ఆ పార్టీ సానుభూతిపరుల్లో సందేహాలకు కారణం అవుతోంది. ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదన్న సందేహాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి.. బీజేపీ, టీడీపీ కలిసి బీఆర్ఎస్ కు సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. టీడీపీ చాలా కాలంగా జూబ్లిహిల్స్ లో యాక్టివ్ గా లేదు. కమ్మ సామాజిక వర్గం మద్దతు .. మాగంటి గోపీనాథ్ సతీమణికి ఉంటుందని టాక్ నడుస్తోంది. ఏదేమైనా జూబ్లిహిల్స్ బై పోల్‌లో బీజేపీ నోటిఫికేషన్‌కు ముందే చేతులు ఎత్తేసినట్టుగా ఉంది.